Home
News

BSNL కొత్త ప్లాన్ అదిరింది.. కాల్స్, SMS కోసం ఇంత తక్కువ ధర ఎక్కడా చూడలేరు..!

ఇంటర్నెట్ డేటా లేకుండా, కేవలం కాలింగ్, మెసేజింగ్ చేసుకునేవాళ్ల కోసం BSNL అదిరిపోయే శుభవార్త చెప్పింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రీసెంట్‌గా టెలికాం కంపెనీలకు ఒక ఆదేశం ఇచ్చింది. అదేంటంటే, కేవలం కాలింగ్, మెసేజింగ్ చేసుకునే యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్లను తీసుకురమ్మని చెప్పింది. ఎందుకంటే చాలామంది డేటా అవసరం లేకపోయినా, డేటా ప్లాన్‌లు కొనాల్సి వస్తోంది. అలాంటి వాళ్లకి ఈ కొత్త ప్లాన్లు బాగా ఉపయోగపడతాయి.

ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, Vi లాంటి కంపెనీలు ఇలాంటి ప్లాన్‌లు తీసుకొచ్చినా, అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. కానీ BSNL మాత్రం తక్కువ ధరకే ప్లాన్లను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. BSNL కొత్తగా తీసుకొచ్చిన వాయిస్-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్‌గా కనిపిస్తోంది.

BSNL new Rs439 plan offers 90 days validity

* కొత్త BSNL రూ.439 ప్లాన్
BSNL రూ. 439 ప్రీపెయిడ్ ప్లాన్ వాయిస్, SMS యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కైనా), ఫ్రీ SMS బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు ఉంటుంది. అంటే మూడు నెలలు హ్యాపీగా వాడుకోవచ్చు.

ఇదే ప్లాన్‌ను మిగతా కంపెనీలతో పోలిస్తే BSNL చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఉదాహరణకు జియో (JIO) రూ.448కి 84 రోజులు, రూ.1748కి 336 రోజుల వ్యాలిడిటీ తో వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.469కి 84 రోజులు, రూ.1849కి 365 రోజుల వ్యాలిడిటీతో వాయిస్, SMS ఓన్లీ ప్లాన్స్ అందిస్తోంది.

Vi కంపెనీ అయితే 270 రోజులకే ఏకంగా రూ.1460 తీసుకుంటోంది. వీఐ రూ.1460కి 270 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేస్తోంది. డేటా అవసరం లేకుండా, సింపుల్‌గా, తక్కువ ధరలో రీఛార్జ్ చేసుకోవాలనుకునేవాళ్లకి BSNL రూ.439 ప్లాన్ సూపర్ ఛాయిస్ అని చెప్పొచ్చు. BSNL ఇంకొన్ని చీప్ ప్లాన్స్ కూడా అందిస్తోంది.

* BSNL లాంగ్-టర్మ్ ప్లాన్ రూ.1198
ఇంకా ఎక్కువ రోజులు వాలిడిటీ ఉండే ప్లాన్ కావాలంటే BSNL దగ్గర రూ.1198 ప్లాన్ కూడా ఉంది. ఇది ఒక ఏడాది పాటు వాలిడిటీతో వస్తుంది. దీని బెనిఫిట్స్ చూస్తే ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ గా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతీ నెలా 30 ఫ్రీ SMSలు సైతం వస్తాయి.

ఈ ప్లాన్ కింద యూజర్లకు నెలకు 3GB 4G ఇంటర్నెట్ డేటా వస్తుంది. అంటే సంవత్సరం మొత్తం 36GB డేటా వాడుకోవచ్చు. ఎక్కువ డేటా అవసరం లేనివాళ్లకి లేదా BSNLని సెకండరీ సిమ్‌గా పెట్టుకోవాలనుకునేవాళ్లకి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వాట్సాప్, సోషల్ మీడియా చెక్ చేసుకోవాలనుకునే ఇది బెస్ట్ ప్లాన్ అవుతుంది.

* మార్కెట్‌లో BSNL దూకుడు
జియో, ఎయిర్‌టెల్ , Viలతో పోలిస్తే BSNLకి కస్టమర్లు తక్కువగా ఉన్నా, తక్కువ ధరకే ప్లాన్లు అందించడంతో ఎక్కువ మంది యూజర్లు BSNL వైపు చూస్తున్నారు. రీసెంట్‌గా BSNL లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీపడుతూ, తక్కువ ధరలో, ఎక్కువ వాలిడిటీ ప్లాన్లను అందిస్తూ BSNL యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.

డేటా ఎక్కువ అవసరం లేనివాళ్లు, తక్కువ ధరకే ప్లాన్లు కావాలనుకునేవాళ్ల కోసమే BSNL ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. BSNL రూ.439, రూ.1198 ప్లాన్లు వాయిస్, SMS బెనిఫిట్స్ కావాలనుకునే కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్స్. ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసులు అవసరం లేనివాళ్లకి ఈ ప్లాన్లు చాలా బాగా ఉపయోగపడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Takes on Telecom Giants, Unlimited Voice Calling, SMS Plan Launched to Challenge Jio Airtel Vi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X