90 రోజుల వ్యాలిడిటీతో బడ్జెట్ ధరలో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు...

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల ఏకైక ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులను ఆకట్టుకోవడానికి గొప్ప గొప్ప ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. సెకండరీ సిమ్ గా వినియోగిస్తూ తక్కువ ధరతో మీ యొక్క మొదటి సిమ్ కు సమానమైన ప్రయాజనాలను పొందాలనుకుంటే కనుక BSNL ఒక మంచి ఎంపిక అవుతుంది. 4G నెట్‌వర్క్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండడంతో నెట్‌వర్క్ సమస్యలు కూడా తీరనున్నాయి.

BSNL

మూడు నెలలు లేదా 90 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ ను రీఛార్జ్ చేయాలనుకుంటే కనుక BSNL మీ కోసం రెండు అద్భుతమైన ఎంపికలను కలిగి ఉంది. ఇవి రెండు కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలను అందిస్తాయి. ప్రైవేట్ టెల్కోలు ఇదే ధర వద్ద 84 రోజుల చెల్లుబాటుతో తక్కువ డేటాతో తమ ప్లాన్‌లను అందిస్తాయి. BSNL యొక్క 90 రోజుల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు మిగిలిన వాటి కంటే ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL వినియోగదారులు 90 రోజుల వ్యాలిడిటీతో రూ.500 లోపు పొందగలిగే మొదటి ప్లాన్ రూ.499 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. దీనితో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB రోజువారీ డేటా మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది BSNL ట్యూన్స్‌తో కూడిన జింగ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.

BSNL రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్

90 రోజుల వ్యాలిడిటీతో లభించే రెండవ ప్లాన్ రూ.485 ధర వద్ద లభిస్తుంది. దీనితో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌, 1.5GB రోజువారీ డేటా మరియు 100 SMS/రోజుకు ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో వస్తుంది. మీరు BSNL యొక్క నెట్‌వర్క్ కవరేజ్ అద్భుతంగా లభించే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే ఈ రెండు ప్లాన్లు అద్భుతమైన ఎంపికలు అని చెప్పవచ్చు. లేకపోతే ప్లాన్‌లు సరసమైనవి అయినప్పటికీ సరైన నెట్‌వర్క్ సర్వీస్ లేకపోతే అవి మీకు పనికిరావు.

ప్రైవేట్ టెల్కోలు

BSNL ప్రస్తుతం 4Gని అందుబాటులోకి తీసుకురావడానికి పని చేస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది విస్తృత స్థాయిలో దేశం మొత్తం మీద అందుబాటులోకి రానున్నది. అందువలన ఈ ప్లాన్‌ల ప్రయోజనం ఆకాశాన్ని తాకుతుంది. BSNL అందించే ఆఫర్‌లతో ప్రైవేట్ టెల్కోలు కొంత తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి.

4G నెట్‌వర్క్‌లు

BSNL యొక్క 4G నెట్‌వర్క్‌లు ప్రారంభంలో కొన్ని కీలకమైన మెట్రో మరియు పట్టణ నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ తన వద్ద ఉన్న పెద్ద మార్కెట్ పరిమాణంతో వేగంగా డబ్బు సంపాదించగలదని ఇది నిర్ధారిస్తుంది. అలాగే మెట్రో మరియు పట్టణ నగరాల్లోని వినియోగదారులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారితో పోల్చినప్పుడు వారు తరచుగా బడ్జెట్‌కు సంబంధించి పెద్ద సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వినియోగదారులు మీ యొక్క సెకండరీ సిమ్ కోసం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకుంటూ బడ్జెట్ ధరలో లభించే ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు BSNL యొక్క STV_49 ప్లాన్ ఒక గొప్ప ఎంపిక. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1GB డేటా మరియు 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను 20 రోజుల చెల్లుబాటు కాలానిక పొందుతారు. ఇది భారీ డేటా ప్లాన్ కాదు కానీ తమ సెకండరీ సిమ్ ను ఎప్పటికి యాక్టీవ్ లో ఉంచాలనుకునే వ్యక్తులకు సరైన ఎంపిక అవుతుంది. బడ్జెట్ ధరలో అధిక మొత్తంలో డేటా కోసం చూస్తున్న వినియోగదారుల కోసం BSNL టెల్కో STV_87 మరొక ప్లాన్ ని అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజుకు మరియు 1GB రోజువారీ డేటా ప్రయోజనాలను 14 రోజుల సర్వీస్ వాలిడిటీ కాలానికి పొందుతారు. FUP డేటా వినియోగం పూర్తి అయిన తరువాత డేటా స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది. మీరు డేటా గురించి అస్సలు పట్టించుకోనట్లయితే మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనం మాత్రమే కావాలనుకుంటే కనుక మీరు STV_99 ప్లాన్ ని ఎంచుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 22 రోజుల చెల్లుబాటు కాలానికి వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. చివరిగా మీరు ఒక పూర్తి నెల లేదా 30 రోజుల చెల్లుబాటు కాలంతో లభించే ప్లాన్ కావాలంటే కనుక మీరు STV_147 ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ BSNL ట్యూన్స్ మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 10GB డేటా ప్రయోజనాలతో 30 రోజుల వాలిడిటీ కాలానికి వస్తుంది. BSNL వెబ్‌సైట్ ఈ ప్లాన్‌తో చేర్చబడిన SMS ప్రయోజనాలను పేర్కొనలేదు.

BSNL 5G

ఇప్పటివరకు జరిగిన అన్ని పరిణామాల దృష్ట్యా చూసుకుంటే కనుక BSNL టెలికాం సంస్థ 2023 సంవత్సరంలో 5Gని లాంచ్ చేయబోతున్నట్లు నివేదించబడింది. అయితే 2023లోనే లాంచ్ జరగాలనుకుంటే కనుక అది నిజంగా టెల్కోకి మంచి విషయమే. 4G ఆలస్యం కావడంతో ఈ టెల్కో ప్రభుత్వం సాయంతో త్వరగా 5G నెట్‌వర్క్‌ లను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాయి. వినియోగదారులకు తాజా తరం కనెక్టివిటీ సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని BSNL టెల్కో 2022 చివర మరియు 2023 ప్రారంభంలో మరిన్ని ఎక్కువ 4G సైట్‌లను విడుదల చేయడమే కాకుండా వాటిలో ఎక్కువగా 5G సైట్‌లుగా వేగంగా అప్‌గ్రేడ్ చేసే ఆలోచనలో ఉంది.

Best Mobiles in India

English summary
BSNL Telcco Offers Two Budget Prepaid Plans With 90 Days Validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X