BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలోని టెలికాం రంగంలోని ఏకైక ప్రభుత్వ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరియు యూజర్ బేస్ ని పెంచుకోవడం కోసం అందించే తరచుగా అనేక ఆఫర్‌లను అందిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తన యొక్క ప్లాట్ఫారంలో జోడించింది. కొన్ని రోజుల క్రితం మేము నివేదించిన రెండు నెలవారీ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు కాదు.

కొత్తగా లాంచ్ చేసిన ప్లాన్లు మూడు వరుసగా 18 రోజులు, 20 రోజులు మరియు 65 రోజుల చెల్లుబాటుతో ప్రత్యేక ప్రయోజనాలతో లభిస్తాయి. ప్రైవేట్ టెల్కోస్‌తో మీరు కొనుగోలు చేసే దానితో పోలిస్తే కనుక ఇవి సరసమైన ధరలోనే లభించడం గమనార్హం. కానీ ప్రైవేట్ టెల్కోల ప్లాన్‌లు కలిగిఉండే 4G నెట్‌వర్క్ మద్దతు మాత్రం ప్రస్తుతం BSNL టెల్కోకి లేదు. ఈ కొత్త ప్లాన్‌లు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL టెల్కో తన వినియోగదారుల కోసం తన యొక్క ప్లాట్ఫారమ్ లో ఇప్పుడు కొత్తగా జోడించిన మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు వరుసగా రూ.99, రూ.118 మరియు రూ.319 ధరల వద్ద లభిస్తాయి. కొన్ని రోజుల ముందు BSNL తన యొక్క వినియోగదారుల కోసం రూ. 228 మరియు రూ. 239 ధరల వద్ద రెండు నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా జోడించింది. దీని అర్థం BSNL ఇప్పుడు మొత్తంగా ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తన యొక్క ప్లాట్ఫారమ్ లో సమర్థవంతంగా అందిస్తున్నది.

BSNL రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL టెల్కో తన యొక్క ప్లాట్ఫారమ్ లో కొత్తగా ప్రారంభించిన మూడు ప్లాన్‌లలో మొదటిది రూ.99 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 18 రోజుల చెల్లుబాటు కాలానికి ఉచిత PRBTతో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వినియోగదారులకు ఈ ప్లాన్ ఎటువంటి డేటా లేదా SMS ప్రయోజనాలను అందించదు.

BSNL రూ.118 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL కొత్తగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ప్లాన్ లలో రెండవది రూ.118 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 20 రోజుల చెల్లుబాటుతో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజువారీ 0.5GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకి తగ్గించబడుతుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో SMS ప్రయోజనాలను పొందలేరు కానీ వారు ఉచిత PRBT సభ్యత్వాన్ని పొందుతారు.

BSNL రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL కొత్తగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ప్లాన్ లలో చివరిది రూ.319 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 65 రోజుల చెల్లుబాటు కాలానికి వినియోగదారులకు మొత్తంగా 300 SMSలు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటుగా 10GB డేటాను అందిస్తుంది. మీకు అధిక డేటా మరియు SMS అవసరాలు లేకుంటే కనుక మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమంగా ఉంటుంది.

BSNL రూ.228 & రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL టెల్కో ఇటీవల ప్రారంభించిన రెండు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా వినియోగదారులకు ఉపయోగకరంగా ఉన్నాయి. టెల్కో ఇటీవల రూ.228 మరియు రూ.239 వరుస ధరల వద్ద రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను లాంచ్ చేసింది. ఈ రెండూ కూడా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ఇవి 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు గేమింగ్ ప్రయోజనాలతో పాటుగా రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో గల తేడా ఏమిటంటే రూ.239 ప్లాన్ వినియోగదారులకు వారి మెయిన్ అకౌంటులో అదనంగా రూ.10 బ్యాలెన్స్ ను జతచేస్తుంది.

BSNL 5G సర్వీస్
ఆన్‌లైన్ నుంచి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం BSNL టెల్కో తన యొక్క 5G నెట్‌వర్క్ విస్తరణ కోసం కోరిన 70 MHz స్పెక్ట్రమ్ కి బదులుగా మిడ్-బ్యాండ్‌లో 40 MHz స్పెక్ట్రమ్‌ను మాత్రమే అందుకోనున్నట్లు సమాచారం. DCC (డిజిటల్ కమ్యూనికేషన్స్ కమీషన్) సిఫార్సులను DoT అనుసరిస్తుంది. 3300-3670 MHz బ్యాండ్‌లో 70 MHz ఎయిర్‌వేవ్‌లను రిజర్వ్ చేయడం వల్ల ప్రైవేట్ టెల్కోలకు 5G ఎయిర్‌వేవ్‌ల కొరత ఏర్పడుతుందని టెలికాం విభాగం భావించింది. BSNL టెలికాం సంస్థ తన యొక్క 5G సర్వీసులను NSA (నాన్-స్టాండలోన్) నెట్‌వర్క్‌ల విడుదలతో ప్రారంభించనున్నది. బేస్ 4G కోర్ నెట్‌వర్క్ నిర్మాణంతో దీనికి నాంది పలకవచ్చు. 5G NSA BSNL కోసం తక్కువ బడ్జెట్ ధరలోనే స్నేహపూర్వకంగా లభిస్తుంది. అయితే 5G SAకి కోసం పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థను సెటప్ చేయవలసి ఉంటుంది. దీని కోసం BSNL వద్ద తగినంత డబ్బు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంతకుముందు గల స్వదేశీ పరికరాలు మరియు టెక్నాలజీను ఉపయోగించి బిఎస్‌ఎన్‌ఎల్ 5G పై పని చేస్తున్నట్లు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) అధికారి తెలిపారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో 5G నెట్‌వర్క్‌లను ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








