BSNL సినిమాప్లస్ OTT సర్వీస్ ఆఫర్ ఉచితంగా లభిస్తుంది!! కాకపోతే...

|

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా తన 'సినిమాప్లస్' (Yupp TV స్కోప్) ఓవర్-ది-టాప్ (OTT) సేవలను ఉచితంగా అందిస్తోంది. కానీ ఈ అద్భుతమైన ఆఫర్ టెల్కో యొక్క FTTH మరియు DSL బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఈ టెలికాం ఆపరేటర్ OTT సర్వీస్ యొక్క ఉచిత ఆఫర్‌ను ప్రస్తుత మరియు కొత్త కస్టమర్‌లందరికీ అందించనున్నారు. ఈ ఉచిత OTT సర్వీస్ ఇప్పుడు భారతదేశంలోని అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL సినిమాప్లస్ సర్వీస్ ఆఫర్

BSNL సినిమాప్లస్ సర్వీస్ ఆఫర్

BSNL యొక్క కొత్త బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు మరియు ఇప్పటికే ఉన్న ప్రస్తుత కస్టమర్ల కోసం కూడా సినిమాప్లస్ OTT ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తోంది. టెల్కో మొదటి నెలలో ఈ సర్వీసును ఉచితంగా అందిస్తుంది. పోస్ట్ చేసిన తర్వాత రెండు నుండి ఆరవ నెల వరకు వినియోగదారులకు నెలకు రూ.129+ GST చొప్పున వసూలు చేయబడుతుంది. ఆరు నెలల తర్వాత అంటే ఏడవ నెల తరువాత వినియోగదారులకు రూ.199 +GST వసూలు చేయబడుతుంది. ఉచిత నెల ముగిసే సమయానికి కస్టమర్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడంలో విఫలమైతే కనుక వారికి ఆటోమేటిక్‌గా నెలకు రూ.129 + GST విధించబడుతుంది.

మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ వేడి అవుతున్నదా!! అయితే ఇలా చేయండి...మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ వేడి అవుతున్నదా!! అయితే ఇలా చేయండి...

BSNL సినిమాప్లస్

BSNL సినిమాప్లస్ అనేది టెల్కో నుండి లభించే ఒక బండిల్డ్ OTT సర్వీస్. ఇది యూజర్లకు Yupp టీవీ స్కోప్, ZEE5 ప్రీమియం, సోనీలైవ్ ప్రీమియం మరియు వోట్ సెలెక్ట్ వంటి అప్లికేషన్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఇవి ప్రముఖ వెబ్ సిరీస్‌లు, లైవ్ టీవీ ఛానెల్‌లు, కొత్త సినిమాలు మరియు మరిన్నింటిని చూడటానికి అనుమతిస్తుంది. ఉచిత BSNL సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకునే వినియోగదారులు టెలికాం యొక్క FTTH లేదా DSL బ్రాడ్‌బ్యాండ్ సేవకు సభ్యత్వం పొందవచ్చు.

BSNL

BSNL నుండి లభించే సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్ యొక్క గొప్ప విషయం ఏమిటంటే వినియోగదారులు ఒకేసారి అనేక పరికరాల్లో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతించబడతారు. మీరు మీ సౌలభ్యం మేరకు మీ టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర పరికరాల్లో కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. ఈ ఆఫర్ ఆపరేటర్ యొక్క నిరంతర సమీక్షలో ఉంటుంది మరియు టెల్కో కోరుకునే ఏ సమయంలోనైనా ఇది మార్చబడుతుంది. ఈ ఆఫర్‌కు ముగింపు కాలం లేదు కానీ అది ఎప్పటికీ అలాగే ఉంటుందని అర్థం కాదు.

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లు

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో వినియోగదారులు ఎలాంటి ప్రమోషనల్ వాలిడిటీ లేకుండా తమకు ఆసక్తి ఉన్న ప్లాన్‌లను ఎంచుకోగలుగుతారు. ముఖ్యంగా సూపర్ స్టార్ ప్రీమియం -1 ప్లాన్ 100 Mbps వేగంతో 1000GB వరకు డేటాను అందిస్తుంది. FUP డేటా పరిమితి దాటిన తరువాత డేటా వేగం 5 Mbps కి పడిపోతుంది. మరోవైపు సూపర్‌స్టార్ ప్రీమియం-2 ప్లాన్ 150 Mbps వేగంతో 2000GB వరకు FUP డేటాను అందిస్తుంది. ఈ FUP పరిమితిని పూర్తి చేసిన తరువాత డేటా వేగం 10 Mbps కి పడిపోతుంది. BSNL FTTH యొక్క ఈ కొత్త ప్లాన్‌లు సూపర్‌స్టార్ ప్రీమియం -1 ప్లాన్ యొక్క ధర రూ.749 కాగా సూపర్‌స్టార్ ప్రీమియం -2 FTTH ప్లాన్ ధర రూ.949. ఈ ప్లాన్‌లలోని ఇతర అంశాల విషయానికి వస్తే ఒక నెల సెక్యూరిటీ డిపాజిట్, కనీస అద్దె వ్యవధి ఒక నెల మరియు టెలిఫోన్ స్థిర నెలవారీ ఛార్జీలు లేవు. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ అందించే ఈ అద్భుతమైన ప్లాన్ లో మీరు గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.299 ప్లాన్ కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు ఎవరూ కూడా ఈ ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందలేరు. కొత్త వినియోగదారులు మొదటి ఆరు నెలలపాటు నెలకు కేవలం రూ.299 చెల్లించి ఈ ప్లాన్ ను పొందవచ్చు. ఈ ప్లాన్ తో వినియోగదారులు 10 Mbps వేగంతో 100GB డేటాను పొందుతారు. 100GB డేటా వినియోగించిన తర్వాత వినియోగదారులు 2 Mbps వేగంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ ను కొనసాగించవచ్చు. DSL కనెక్షన్‌తో వినియోగదారులు అపరిమిత టాక్‌టైమ్‌ ప్రయోజనాలను అందించే కంపెనీ యొక్క ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ని స్వీకరించడానికి కూడా అర్హులు అవుతారు. అయితే ఈ ప్లాన్ తో లభించే ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనం ఏమి లేదు. ఈ ప్లాన్ యొక్క ధర వద్ద OTT ప్రయోజనాలను ఆశించడం అత్యాస అవుతుంది.

Best Mobiles in India

English summary
BSNL Telco Offers Cinemaplus Free OTT Service For Existing and New Broadband Customers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X