BSNL యొక్క ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా Eros Now సబ్స్క్రిప్షన్

|

ప్రభుత్వ ఆద్వర్యంలోని ఏకైక టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యొక్క ఈవెంట్‌ల ఇటీవలి అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు దాని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు దాని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో Eros Now యొక్క కంటెంట్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈరోస్ నౌ తన కాంట్రాక్ట్ విస్తరణపై నేడు అధికారిక ప్రకటన చేసింది. 2019లో Eros Now యొక్క సబ్స్క్రిప్షన్ ను ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కస్టమర్‌లకు అందించడానికి BSNLతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Eros Nowతో వినియోగదారులు 12000 కంటే ఎక్కువ సినిమాలు, ప్రీమియం ఒరిజినల్‌లు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్-ఫారమ్ కంటెంట్ వంటి వాటికి యాక్సెస్ పొందవచ్చు. అయితే పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పాటుగా యాక్సిస్ చేయడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL మరియు Eros Now మధ్య ఒప్పందం

BSNL మరియు Eros Now మధ్య ఒప్పందం

ఈరోస్ నౌ సంస్థ ప్రకటించిన తన కొత్త ప్రకటనలో బాగంగా BSNL పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకునే కస్టమర్లందరికీ దాని ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు ధృవీకరించింది. STV యాక్టివ్‌గా ఉండే వరకు BSNL దాని ఎంచుకున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో Eros Now ప్లస్ సభ్యత్వాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఈ భాగస్వామ్యం రెండు కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. BSNL భారతదేశంలోని ఇరవై రెండు టెలికాం సర్కిల్‌లలో పని చేస్తుంది. అయితే Eros Now హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ వంటి మరిన్ని బహుళ భాషలలో దేశమంతటా దాని కంటెంట్‌ను అందిస్తోంది.

BSNL

BSNL నుండి ఎంపిక చేయబడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మాత్రమే ఈరోస్ నౌ కంటెంట్ ఉచితంగా అందించబడుతుంది. అయితే కొత్త ఒప్పందంలో భాగంగా Eros Now ఫ్రీ సబ్స్క్రిప్షన్ తో కూడిన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. Eros Now ఆఫర్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లు 8 రోజుల చెల్లుబాటుతో రూ.78 ప్యాక్, మరియు రూ.98 ప్లాన్ 20 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ రూ.297 ధర ఉన్న ఆంధ్రప్రదేశ్ మినహా 54 రోజుల చెల్లుబాటుతో వచ్చే రూ. 298 BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌పై కూడా వర్తిస్తుంది.

BSNL
 

అదనంగా BSNL యొక్క రూ.333 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల చెల్లుబాటుతో మరియు 60 రోజుల చెల్లుబాటుతో లభించే రూ.444 ప్రీపెయిడ్ ప్లాన్‌పై కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెలికాం కంపెనీ మరియు ప్రైవేట్ OTT ప్లాట్‌ఫారమ్ మధ్య ఈ భాగస్వామ్యం ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇది రెండు సంస్థలకు విస్తృత ప్రేక్షకులను చేరేలా చేస్తుంది.

రూ.1.42లకే 1GB డేటాను అందిస్తున్న BSNL

రూ.1.42లకే 1GB డేటాను అందిస్తున్న BSNL

BSNL టెల్కో తన వినియోగదారులకు రూ.599 ధర వద్ద ‘STV_WFH_599' పేరుతో ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అంటే ఈ ప్లాన్ వినియోగదారులకు మొత్తం చెల్లుబాటు కాలానికి 420GB డేటాను అందిస్తుంది. ఇతర ప్రైవేట్ కంపెనీలు ఏవీ కూడా 84 రోజుల వాలిడిటీ కాలంలో వినియోగదారులకు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఇంత మొత్తంలో డేటాను అందించవు. ముఖ్యంగా ఈ ప్లాన్‌తో వినియోగదారుడు వినియోగించే ప్రతి GB డేటాకు రూ.1.42 మాత్రమే ఖర్చు అవుతుంది. జింగ్ యొక్క ప్రయోజనం కూడా ఉచితంగా వినియోగదారులకు అందించబడుతుంది.

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్

BSNL యొక్క కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మరియు ఇతర ఆపరేటర్ల నుండి BSNL నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసే వారికి ఇప్పుడు ఉచితంగా 4G సిమ్ కార్డులను సంస్థ అందిస్తోంది. ప్రారంభంలో ఈ ఆఫర్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. తరువాత ఇది సెప్టెంబర్ వరకు ఆఫర్‌ను పొడిగించింది. ఇప్పుడు ఈ ఆఫర్ డిసెంబర్ వరకు పొడిగించబడినట్లు సంస్థ నివేదించింది. సాధారణంగా BSNL యొక్క 4G SIM కార్డ్ రూ.20 ధర వద్ద లభిస్తుంది. ఇది కొత్త వినియోగదారులకు మరియు MNP పోర్ట్ వినియోగదారులకు రూ.100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మినహాయించబడుతుంది. ఈ BSNL ఉచిత 4G సిమ్ ఆఫర్ BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్స్ (BSNL) మరియు రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా పొందవచ్చు.

BSNL - గూగుల్ నెస్ట్ మినీ ఆఫర్

BSNL - గూగుల్ నెస్ట్ మినీ ఆఫర్

BSNL తెలంగాణ సర్కిల్ ద్వారా ఈ కొత్త ఆఫర్ ప్రారంభించబడింది. BSNL కొన్ని వారాల క్రితం తన బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల కోసం ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ కొత్త పేమెంట్ పోర్టల్ కింద BSNL చందాదారులు వారు DSL లైన్, FTTH లేదా ఎయిర్ ఫైబర్‌ వంటి అన్ని రకాల పేమెంట్ లను తమ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లేదా ఇతర పేమెంట్ ఎంపికలతో ముందుగానే వారి బిల్లులకు పేమెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ పర్యావరణ వ్యవస్థను మరింత దృఢమైన రీతిలో స్వీకరించాలని వినియోగదారులను కోరడానికి BSNL తన చందాదారుల కోసం ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Telco Offers Eros Now Free Membership On Selected Postpaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X