రూ.100లోపు ధరలోనే లభించే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు!!

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెలికాం సంస్థ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అవుతున్న విషయం అందరికి తెలిసినదే. 4G నెట్‌వర్క్‌ సమస్య కారణంగా అధిక మంది దీనిని వినియోగించడానికి ఇష్టపడడం లేదు. కానీ మీరు ఉపయోగిస్తున్న రెండు సిమ్ లలో రెండవదిగా ప్రభుత్వ టెల్కో సిమ్ ని ఉపయోగించడంతో ప్రభుత్వానికి ఆదాయం అందించిన వారు అవుతారు. ప్రైవేట్ టెల్కోల మాదిరి ఇది అధిక ధరల వద్ద రీఛార్జ్ ప్లాన్‌లను అందించడం లేదు. మీకు నిజంగా రూ.100లోపు ధరలో సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ కావాలంటే కనుక BSNL టెలికాంను ఆశ్రయించవచ్చు.

 

BSNL

BSNL త్వరలోనే 4G సేవలను అందుబాటులోకి తీసుకొనివచ్చి ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క ప్లాన్‌లకు సవాలును విసరానున్నది. దీని కారణంగా అధిక మంది వినియోగదారులు తమ పరికరాలలో BSNL సిమ్‌ను సెకండరీ సిమ్ ను మంచి ఎంపికగా ఉంచుకోవచ్చు. అయితే మీరు BSNL నెట్‌వర్క్‌లు మంచి అనుభవాన్ని అందించగల ప్రాంతంలో నివసిస్తుంటే కనుక మీకు ప్రాథమిక ఎంపికగా కూడా ఉంటుంది. BSNL అందించే సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Eros Now OTT సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత యాక్సెస్‌తో లభించే BSNL ప్లాన్‌లు...Eros Now OTT సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత యాక్సెస్‌తో లభించే BSNL ప్లాన్‌లు...

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు
 

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వినియోగదారులు మీ యొక్క సెకండరీ సిమ్ కోసం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకుంటూ బడ్జెట్ ధరలో లభించే ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు BSNL యొక్క STV_49 ప్లాన్ ఒక గొప్ప ఎంపిక. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1GB డేటా మరియు 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను 20 రోజుల చెల్లుబాటు కాలానిక పొందుతారు. ఇది భారీ డేటా ప్లాన్ కాదు కానీ తమ సెకండరీ సిమ్ ను ఎప్పటికి యాక్టీవ్ లో ఉంచాలనుకునే వ్యక్తులకు సరైన ఎంపిక అవుతుంది.

ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ ఫోన్‌లో వేక్-అప్ కాల్‌ను సెట్ చేయడం ఎలానో తెలుసుకోండి...ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ ఫోన్‌లో వేక్-అప్ కాల్‌ను సెట్ చేయడం ఎలానో తెలుసుకోండి...

అపరిమిత వాయిస్ కాలింగ్

బడ్జెట్ ధరలో అధిక మొత్తంలో డేటా కోసం చూస్తున్న వినియోగదారుల కోసం BSNL టెల్కో STV_87 మరొక ప్లాన్ ని అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజుకు మరియు 1GB రోజువారీ డేటా ప్రయోజనాలను 14 రోజుల సర్వీస్ వాలిడిటీ కాలానికి పొందుతారు. FUP డేటా వినియోగం పూర్తి అయిన తరువాత డేటా స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది.

STV_147

మీరు డేటా గురించి అస్సలు పట్టించుకోనట్లయితే మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనం మాత్రమే కావాలనుకుంటే కనుక మీరు STV_99 ప్లాన్ ని ఎంచుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 22 రోజుల చెల్లుబాటు కాలానికి వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. చివరిగా మీరు ఒక పూర్తి నెల లేదా 30 రోజుల చెల్లుబాటు కాలంతో లభించే ప్లాన్ కావాలంటే కనుక మీరు STV_147 ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ BSNL ట్యూన్స్ మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 10GB డేటా ప్రయోజనాలతో 30 రోజుల వాలిడిటీ కాలానికి వస్తుంది. BSNL వెబ్‌సైట్ ఈ ప్లాన్‌తో చేర్చబడిన SMS ప్రయోజనాలను పేర్కొనలేదు.

NSA టెక్నాలజీతో BSNL 5G సర్వీస్

NSA టెక్నాలజీతో BSNL 5G సర్వీస్

BSNL టెలికాం సంస్థ తన యొక్క 5G సర్వీసులను NSA (నాన్-స్టాండలోన్) నెట్‌వర్క్‌ల విడుదలతో ప్రారంభించనున్నది. బేస్ 4G కోర్ నెట్‌వర్క్‌ నిర్మాణంతో దీనికి నాంది పలకవచ్చు. 5G NSA BSNL కోసం తక్కువ బడ్జెట్ ధరలోనే స్నేహపూర్వకంగా లభిస్తుంది. అయితే 5G SAకి కోసం పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థను సెటప్ చేయవలసి ఉంటుంది. దీని కోసం BSNL వద్ద తగినంత డబ్బు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంతకుముందు గల స్వదేశీ పరికరాలు మరియు టెక్నాలజీను ఉపయోగించి బిఎస్‌ఎన్‌ఎల్ 5G పై పని చేస్తున్నట్లు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) అధికారి తెలిపారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో 5G నెట్‌వర్క్‌లను ఆశించవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL These Budget Prepaid Plans That Will Keep Your Pockets From Burning

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X