Eros Now OTT సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత యాక్సెస్‌తో లభించే BSNL ప్లాన్‌లు...

|

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా(Vi) మూడు ప్రైవేట్ టెలికాం సంస్థలు భారతీయ టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయిస్తు అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్నాయి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో BSNL 4G సేవలు అందుబాటులో లేనప్పటికీ మరియు తక్కువ మంది యూజర్లను కలిగి ఉన్నప్పటికీ కూడా ఇతర ఆపరేటర్ల మాదిరిగానే అధిక ప్రయోజనాలతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. BSNL యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు చాలా తక్కువ ధర ట్యాగ్‌ల వద్ద అధిక చెల్లుబాటుతో పాటుగా అధిక మొత్తంలో డేటాను అందిస్తాయి. Ott ప్రయోజనాలతో రూ.500 ధరలోపు లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

STV_399 ప్రీపెయిడ్ ప్లాన్‌

STV_399 ప్రీపెయిడ్ ప్లాన్‌

BSNL టెల్కో రూ.500 ధరలోపు అందించే జాబితాలోని మొదటి ప్లాన్ STV_399. ఇది 80 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 1GB డేటాను మరియు 100 SMS/రోజుకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా BSNL ట్యూన్‌లు మరియు లోక్‌ధున్ కంటెంట్‌కు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. జాబితాలోని తదుపరి STV_429 ప్లాన్ కొంచెం మెరుగైన ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది రోజుకు 81 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో ఇది Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

డేటా-ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్

జాబితాలో తదుపరిది టెల్కో అందించే డేటా-ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ రూ. 447 ధర ట్యాగ్‌తో 60 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి 100GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. 100GB డేటా సెట్ పరిమితిని దాటిన తరువాత వినియోగదారులు 80 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ వెబ్‌సైట్‌లో 'డేటా వోచర్' విభాగంలో పేర్కొన్నప్పటికీ ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. STV_447 ప్లాన్‌తో పాటు వినియోగదారులు BSNL ట్యూన్స్ మరియు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. BSNL తన యొక్క వినియోగదారుల కోసం మూడు నెలల చెల్లుబాటుతో లభించే STV_499 ప్యాక్‌ను కూడా అందిస్తుంది. రూ.499 ధరతో లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు 90 రోజుల వాలిడిటీ కాలానికి రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందించదు.

BSNL 5G నెట్‌వర్క్‌లు

BSNL 5G నెట్‌వర్క్‌లు

ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ఈ సంవత్సరం చివరినాటికి 5G నెట్‌వర్క్ లాంచ్ చేసే ఆలోచనలో ఉండగా ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మాత్రం 2023లో 5Gని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించడంపై టెల్కో అధికంగా దృష్టిని సారించింది. ఈ ప్రభుత్వ టెల్కో ఎప్పటికి 2G మరియు 3G సేవలను కొనసాగిస్తున్నది. ఇండియాలో స్వదేశీ 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా ఈ టెల్కో పెట్టుకుంది. ఇప్పటికే TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరియు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) భాగస్వామ్యంతో స్వదేశీ 4G కోర్‌ను అభివృద్ధి చేసింది. ప్రైవేట్ టెల్కోలు 5G నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తీసుకొనిరావడానికి స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయో లేదో అని అస్పష్టంగా ఉన్నది. కానీ 5G నెట్‌వర్క్‌ల మాత్రం BSNL సంస్థ స్వదేశి టెక్నాలజీపై అదరపడుతున్నట్లు స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ఆధీనంలోని ఈ టెలికాం ఆపరేటర్ తన స్థానిక భాగస్వాములతో 4G పరిష్కారాలను పరీక్షిస్తున్న సమయంలోనే 5G 5G నెట్‌వర్క్‌లను కూడా అందుబాటులోకి తీసుకొనిరావడంపై పని చేస్తోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇంకా 5G స్పెక్ట్రమ్‌ను BSNLకి కేటాయించలేదు. ఎటువంటి స్పెక్ట్రమ్‌ కొనుగోలు లేనప్పటికీ కూడా 5G సేవలను అందించడం కోసం BSNL డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి పొందే ప్రసారాలను చూడటం ఆసక్తికరంగా ఉంది.

 

Best Mobiles in India

English summary
BSNL These Prepaid Plans Comes With Eros Now Entertainment Free Access Services

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X