Home
News

BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు యూజర్లు చెల్లించే మొత్తానికి గొప్ప విలువను కలిగి ఉన్నాయి...

ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL టెల్కో అద్భుతమైన ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. చాలావరకు ప్రైవేట్ దిగ్గజాల కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది. BSNL భారతదేశం అంతటా సమగ్రమైన టెలికాం సేవలను అందించే అతిపెద్ద మరియు ప్రముఖ పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో (PSUలు) ఒకటి. BSNL తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడమే కాకుండా అద్భుతమైన డేటా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో OTT ప్లాట్‌ఫారమ్‌లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. డేటా మరియు వాయిస్ కాల్‌ల పరంగా వినియోగదారులు వారు చెల్లించే డబ్బుకు గొప్ప విలువను అందించే BSNL యొక్క మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

STV_429 ప్లాన్

STV_429 ప్లాన్

జాబితాలో మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ BSNL అందించే STV_429 ప్లాన్. ఇది OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌తో వస్తుంది. ఈ ప్లాన్ 81 క్యాలెండర్ రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రూ.429 ధర వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు సెట్ చేసిన 1GB రోజువారీ పరిమితి తర్వాత 40 Kbps వద్ద అపరిమిత డేటాను కూడా పొందుతారు. అదనంగా Eros Now వినోద సేవలకు ఉచిత యాక్సెస్‌తో పాటు రోజుకు 100 SMSలను కూడా పొందుతారు. వెబ్‌సైట్‌లోని ‘వాయిస్ వోచర్' విభాగం కింద ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.

STV_447 ప్లాన్‌

STV_447 ప్లాన్‌

జాబితాలో తదుపరిది టెల్కో అందించే డేటా-ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ రూ.447 ధర వద్ద వస్తుంది. ఇది మొత్తం చెల్లుబాటులో 100GB హై-స్పీడ్ డేటాను మరియు రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. 100GB డేటా సెట్ పరిమితిని దాటిన తరువాత వినియోగదారులు 80 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ 60 క్యాలెండర్ రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. వెబ్‌సైట్‌లో 'డేటా వోచర్' విభాగం క్రింద దీనిని పొందవచ్చు. STV_447 ప్లాన్‌తో వినియోగదారులు BSNL ట్యూన్స్ మరియు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌కు కూడా సభ్యత్వాన్ని పొందవచ్చు.

STV_WFH_599 ప్లాన్

STV_WFH_599 ప్లాన్

జాబితాలో చివరిది BSNL అందించే దీర్ఘకాలిక మరియు అధిక డేటా ప్రీపెయిడ్ ప్లాన్. BSNL యొక్క STV_WFH_599 అనే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.599 ధర వద్ద రోజుకు 5GB డేటా ప్రయోజనంతో లభిస్తుంది. సెట్ చేయబడిన 5GB డేటా పరిమితి తర్వాత వినియోగదారులు 80 Kbps వేగంతో ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి 84 రోజులు. ముంబై మరియు ఢిల్లీలో రోమింగ్‌తో సహా హోమ్ LSA మరియు నేషనల్ రోమింగ్‌లో వినియోగదారులు నిజంగా అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్ జింగ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులు వేలాది పాటలు, సినిమాలు మరియు ఇతర వినోద కంటెంట్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌లో ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులు 00:00 గంటల నుండి 05:00 గంటల వరకు అపరిమితంగా డేటాను యాక్సిస్ చేయడానికి అవకాశం అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL These Prepaid Plans Have Great Value For The Amount Users Pay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X