Home
News

BSNL సిమ్ కార్డులతో స్మార్ట్‌ఫోన్..

టెలికం రంగంలో ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త వ్యూహంతో వస్తోంది.

By Hazarath

టెలికం రంగంలో ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త వ్యూహంతో వస్తోంది. త్వరలోనే బీఎస్ఎన్ఎల్ సిమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా దేశీయ మొబైల్ మేకర్స్ మైక్రోమ్యాక్స్, లావా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కె.రామ్‌చంద్ తెలిపారు.

రెండు సంస్థలతో ఒప్పందం

రెండు సంస్థలతో ఒప్పందం

ఇప్పటికే రెండు సంస్థలతో ఒప్పందం కుదిరినప్పటికీ ధర ఇంకా నిర్ణయించలేదని, సిమ్‌లను ఇప్పటికే ఆయా కంపెనీలకు పంపినట్టు హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కె.రామ్‌చంద్ చెప్పారు

తమ ఖాతాదారులు..

తమ ఖాతాదారులు..

ఇతర కంపెనీల నెట్‌వర్క్‌లకు తమ ఖాతాదారులు మారకుండా ఉండడంతోపాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు BSNLఈ సరికొత్త ప్లాన్లును తీసుకొస్తోంది.

వైఫై సేవలు..

వైఫై సేవలు..

వైఫై సేవలు మరింత విస్తరించేందుకు 118 గ్రామీణ వైఫై ఎక్స్సేంజ్‌లను ఏర్పాటు చేయాలని BSNL నిర్ణయించింది. వచ్చే ఏడాది 4జీ సేవలను అందుబాటులో తెచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

ఆధార్‌ అనుసంధానం

ఆధార్‌ అనుసంధానం

2018, ఫిబ్రవరి 6వ తేదీ లోగా మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరిగా చేయించాలని రామ్‌చంద్ సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉచిత కాల్స్, డేటా రోమింగ్‌ అందిస్తున్నామని ఆయన తెలిపారు.

 విజయ్, లక్ష్మి అనే ఆఫర్లను..

విజయ్, లక్ష్మి అనే ఆఫర్లను..

పండుగ సీజన్ సందర్భంగా విజయ్, లక్ష్మి అనే ఆఫర్లను BSNL ప్రకటించింది. ఈ ప్లాన్ల కింద రీఛార్జ్ చేసుకున్నవారికి మెయిన్ ఖాతాకు 50 శాతం అధిక టాక్ వాల్యూ జత అవుతుంది.

 

180 రోజుల కాలపరిమితి

180 రోజుల కాలపరిమితి

180 రోజుల కాలపరిమితి గల రూ. 429 ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌ లిమిటెడ్‌ కాల్స్, ప్రతిరోజు ఒక జీబీ డేటా, 90 రోజుల అనంతరం ప్రతి 1 జీబీకి మూడు పైసలు చార్జీలు ఉంటాయి.

ప్లాన్‌ రూ.666లో

ప్లాన్‌ రూ.666లో

ప్లాన్‌ రూ.666లో 90 రోజుల కాలపరిమితి, అన్ని నెట్‌వర్క్‌లకు 2 జీబీ డాటా, 90 రోజులు దాటిన తర్వాత ప్రతి 2 జీబీకి మూడు పైసల చార్జీలు ఉంటాయి.

 

 

Best Mobiles in India

English summary
BSNL ties up with Lava, Micromax Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X