BSNL 4జీ వచ్చేస్తోంది..
ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్ సేవలను మార్చి, 2019 నుంచి కమర్షియల్‌గా ప్రారంభించబోతోంది.
ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్ సేవలను మార్చి, 2019 నుంచి కమర్షియల్‌గా ప్రారంభించబోతోంది. ఈ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన 4జీ స్పెక్ట్రమ్ అక్టోబర్ చివరినాటికి బీఎస్ఎన్ఎల్‌లకు లభించబోతోంది. ఆ తరువాత నుంచి నెట్‌వర్క్ టెస్టింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. 4వ తరం (4జీ) స్పెక్ట్రమ్‌ను పొందంటం ద్వారా దేశవ్యాప్తంగా తమకున్న 100 మిలియన్ కస్టమర్‌లకు మెరుగైన డేటా సేవలను అందించవచ్చని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.

అన్‌లిమిట్ (Unlimit)తో ఒప్పందం..
బుధవారం అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్స్‌కు చెందిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) కంపెనీ అన్‌లిమిట్ (Unlimit)తో బీఎస్ఎన్ఎల్ కీలక ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ (వాల్యూ యాడెడ్ సర్వీస్ విభాగం) డీకే అగర్వాల్ తమ 4జీ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.

4జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను....
4జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను ఇప్పటికే ఆర్డర్ చేసామని, మార్చి 2019 నాటికి కమర్షియల్‌గా తమ 4వ తరం సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి 2100 మెగాహెర్ట్జ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్ లభించబోతోందని, ఈ బ్యాండ్‌విడ్త్‌లో తమ 4జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

50,000కు పైగా కొత్త టవర్‌ల ఏర్పాటు..?
4జీ నెట్‌వర్క్ ఏర్పాటును దృష్టిలో ఉంచుకుని రానున్న నెలల్లో 50,000కు పైగా కొత్త టవర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న జీఎస్ఎమ్ సైట్లలోనే 4జీ బేస్ టవర్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామని, దీంతో టవర్ల నిర్మాణానికి అదనపు ఖర్చు ఉండదని ఆయన తెలిపారు. ఇక రిలయన్స్ గ్రూప్స్‌కు చెందిన ఐఓటీ కంపెనీ అన్‌లిమిట్‌తో కుదర్చుకున్న ఒప్పందం పై అగర్వాల్ స్పందిస్తూ నాన్-ఎక్స్‌క్లూజివ్ బేసిస్ క్రింద తమ వెర్‌లైస్ నెట్‌వర్క్ క్యాపబిలిటీస్, అన్‌లిమిట్ సబ్‌స్ర్కైబర్స్‌కు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చే ఏడాది నాటికి 10 లక్షలు కొత్త కస్టమర్ లను తాము టార్గెట్ చేస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.

బీఎస్ఎన్ఎల్‌తో ఒప్పందం మేలు చేకూరుస్తుంది...
అనిల్ అంబానీ నేతృత్వంలోని అన్‌లిమిట్ (Unlimit) సంస్థను 2016లో లాంచ్ చేసారు. ఈ సంస్థ ఆఫర్ చేస్తోన్న ఐఓటీ ఆధారిత సేవలు ద్వారా ఇప్పటికే లక్ష డివైస్‌లకు చేరువైనట్లు సంస్థ చెబుతోంది. బీఎస్ఎన్ఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో తమ ఐఓటీ యూజర్ సంఖ్య మరింత పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుర్గెన్ హేస్ తెలిపారు. కనెక్టెడ్ వెహికల్స్, ఇండస్ట్రీ ఆటోమేషన్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల పై తమ కంపెనీ ప్రధానంగా ఫోకస్ చేస్తోందని హేస్ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే..?
కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ త్వరలో మరొక సంచలన ఆవిష్కరణకు నాంది పలకబోతోంది. మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో 5జీ నెట్‌వర్క్ ద్వారా సాకారం కాబోతోంది.

మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి...
మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే.. యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది.


Click it and Unblock the Notifications








