Home
News

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ సంవత్సరం ఏకంగా రూ.47 వేల కోట్లు..!

BSNL to Get Rs47000 Crores : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ( భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ) ప్రస్తుతం యూజర్ల పరంగా నాలుగో స్థానంలో ఉంది. నెట్‌వర్క్‌ సహా అనేక సమస్యలతో సతమతం అవుతోంది. అయితే గత కొన్ని నెలలుగా నెట్‌వర్క్ మెరుగుపరచడం సహా ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవలే లక్ష 4G టవర్లను ఏర్పాటు చేసింది.

4G నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు అత్యధిక శాతం ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ ను అందిస్తున్నాయి. వోడాఫోన్‌ ఐడియా కూడా క్రమంగా 5G నెట్‌వర్క్‌ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

BSNL to get Rs47000 crores to boost network

BSNL కోసం రూ.47 వేల కోట్లు :
తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. BSNL నెట్‌వర్క్‌ విస్తరణ కోసం ఈ ఏడాదిలో రూ.47 వేల కోట్ల మూలధనం అందించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టెలికాం విభాగం (DoT) సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఫలితంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.

గత సంవత్సరం రూ.25 వేల కోట్లు :
గత సంవత్సరం 4G నెట్‌వర్క్‌ కు సంబంధించిన టవర్ల ఏర్పాటు కోసం రూ.25 వేల కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెట్టింపు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆ శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా.. తాజాగా కీలక సమీక్ష నిర్వహించారు.

లక్ష్యాలను నిర్దేశించిన టెలికాం మంత్రి :
BSNL కు వృద్ధికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. యూజర్లను మరింత ఆకట్టుకొనేందుకు చర్యలు తీసుకుంటా ARPU ను పెంచాలని సూచించారు. మొబైల్ వ్యాపారాన్ని 50 శాతం, ఎంటర్‌ఫ్రైజ్‌ బిజినెస్‌ ను 25-30 శాతం, ఫిక్సడ్‌ లైన్ బిజినెస్‌ ను 15-20 శాతం పెంచాలని సూచించారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆజాదీ కా ప్లాన్ :
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL ఆగస్టు 1 నుంచి అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.1 రూపాయికే నెలరోజుల వ్యాలిడిటీతో కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలను అందిస్తోంది. ఆజాదీ కా ప్లాన్‌ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

30 రోజుల వ్యాలిడిటీ :
ఈ ఆఫర్‌లో భాగంగా రూ.1 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS, ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. అయితే కొత్త సిమ్ కొనుగోలుపై మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని BSNL తెలిపింది.

ఆగస్టు 31 వరకు ఛాన్స్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆజాదీ కా ఆఫర్‌ ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 31 వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ పొందేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైలర్‌ లేదా అథరైజ్‌ సర్వీస్‌ సెంటర్‌ను సంప్రదించాలని BSNL సూచించింది. కొత్త యూజర్లను ఆకట్టుకొనేందుకు ఈ ఆఫర్‌ను ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL to get Rs47000 crores to boost network, DoT announced as fresh capital expenditure
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X