BSNL నుంచి 4G ఫీచర్ ఫోన్‌లు.. భారతీయ సంస్థతో కీలక ఒప్పందం.. పూర్తి వివరాలు..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL 4G నెట్‌వర్క్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొంది. గత వారానికి 35 వేల టవర్లను ఏర్పాటు చేసింది. లడఖ్‌లో కూడా టవర్ ఏర్పాట్లు చేసినట్లు ఇటీవల వెల్లడించింది. జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్‌ల ధరల పెంపుతో BSNL వైపు అనేక మంది మొగ్గుచూపుతున్నారు. అయితే 4G ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన అనంతరం తక్కువ సమయంలో 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నుంచి కీలక సమాచారం వెల్లడైంది. 4G నెట్‌వర్క్‌ను సపోర్టు చేసే ఫీచర్ ఫోన్‌లను (BSNL 4G Feature Phones) అందుబాటులోకి తీసుకురావాలని BSNL నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే కార్బన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అక్టోబర్ 1న BSNL 24వ వార్షికోత్సవం సందర్భంగా రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఫోన్లను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. జియోభారత్, జియోభారత్ K1 ఫీచర్‌ను కార్బన్ భాగస్వామ్యంతోనే జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం BSNL- కార్బన్ భాగస్వామ్యంతో 4G ఫీచర్ ఫోన్‌లు విడుదల కానున్నాయి. అయితే ఎంత ధరలో విడుదల చేయనున్నారు మరియు ఏయో ఫీచర్లను కలిగి ఉంటాయో తెలియాల్సి ఉంది.
ఈ ఒప్పందంపై X ద్వారా BSNL వివరాలు వెల్లడించింది. భారత్ 4G కంపానియన్ పాలసీ కింద ప్రత్యేకమైన హ్యాండ్‌సెట్‌ను పరిచయం చేసేందుకు MOU పై BSNL, కార్బన్ మొబైల్స్ సంతకాలు చేసినట్లు తెలిపింది. దేశంలోని ప్రతిమూలకు 4G కనెక్టివిటీ అందించే లక్ష్యాన్ని నిర్దేశించికున్నట్లు BSNL తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
With the signing of a landmark #MoU, #BSNL and #KarbonnMobiles to introduce an exclusive SIM handset bundling offer under the Bharat 4G companion policy. Together, we aim to bring affordable 4G connectivity to every corner of the nation.#BSNLDay #BSNLFoundationDay pic.twitter.com/M37lXjhaGP
— BSNL India (@BSNLCorporate) October 1, 2024
అయితే ఈ ఫీచర్ ఫోన్‌ల కోసం BSNL ప్రత్యేకమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న జియో ఫీచర్ ఫోన్‌ల పోటీనిచ్చే అవకాశం ఉంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ కార్బన్ ఫోన్‌లు ఎప్పుడు విడుదల కానున్నాయి. స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ 24 వార్షికోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేసింది. 500 కంటే ఎక్కువ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై 24GB ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక వ్యవస్థను పరిచయం చేస్తున్నట్లు BSNL ఇటీవలే వెల్లడించింది. ఇటీవలే ఎయిర్‌టెల్ కూడా ఇదే తరహా సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








