Home
News

BSNL కథ కీలక మలుపు తిరగనుందా.. సెప్టెంబర్ 27 వ తేదీన ఏం జరగనుంది?

భారత టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL సరిపెట్టుకుంది. ప్రైవేటు టెలికాం సంస్థలు ఇప్పటికే 5G నెట్‌వర్క్‌ను అందిస్తుంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇంకా 4G నెట్‌వర్క్‌ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. అయితే గతంలో గాడి తప్పిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం క్రమంగా మెరుగవుతోంది. నెట్‌వర్క్‌, సేవల పరంగా గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగైంది.

4G కోసం టీసీఎస్‌, తేజస్ నెట్‌వర్క్‌తో C-DoT జతకట్టింది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంలో 4G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకుంది. మరియు దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం గత సంవత్సరం భారీగా కేటాయించింది. ఈ సంవత్సరం కూడా సుమారు రూ.47 వేల కోట్లు కేటాయింపులు పొందినట్లు తెలిసింది.

BSNL set to rollout 4G network accross the country on september 27  2025

సమయం దగ్గరపడిందా? :
అయితే BSNL పరిస్థితిని చక్కదిద్దేందుకు కొన్న సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెట్‌వర్క్‌ మెరుగుపరిచేందుకు టవర్ల ఏర్పాటు సహా నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఫలితాలు యూజర్లకు చేరే సమయం దగ్గరపడినట్లు తెలుస్తోంది.

సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా :
బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా సెప్టెంబర్ 27 న శుభవార్త ఉంటుందని చెబుతోంది. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. దేశవ్యాప్తంగా BSNL 4G నెట్‌వర్క్‌ ను అదే రోజు ప్రారంభించనుంది. BSNL CMD రాబర్ట్‌ రవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

BSNL set to rollout 4G network accross the country on september 27  2025

'సెప్టెంబర్‌ 27 వ తేదీన కీలక మార్పు రానుంది. స్వదేశీ డిజిటల్ భారత్ కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని BSNL తన X హ్యాండిల్‌లో షేర్‌ చేసింది'. ఇందుకు సంబంధించి 14 సెకన్ల వీడియోను కూడా పోస్ట్‌ చేసింది. కనెక్టివిటీ అర్ధాన్ని BSNL మార్చనుందని తెలిపింది.

* బీఎ‌స్‌ఎన్‌ఎల్‌ ఇటీవలే దేశ రాజధాని ప్రాంతం (Delhi NCR) 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలోని యూజర్లు 4G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోగలుగుతున్నట్లు తెలిపింది. 4G సిమ్‌ కార్డులను BSNL కస్టమర్‌ సర్వీస్ కేంద్రాలు, డీలర్ల నుంచి eKYC పూర్తి చేసి, పొందవచ్చని సూచించింది.

దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్ల ఏర్పాటు కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించింది. దీంతోపాటు నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా మరో రూ.47 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే 4G ని అభివృద్ధి చేసింది. 5G నెట్‌వర్క్‌కు సులభంగా అప్‌గ్రేడ్‌ అయ్యేలా ఈ సాంకేతికతను రూపొందించింది.

* దీంతోపాటు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వీలుగా అనేక చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్ పేరుతో ఆగస్టు 1 నుంచి కొత్త ఆఫర్‌ను ప్రకటన చేసింది. కొత్త సిమ్ కార్డు కొనుగోలుపై రూ.1 రీఛార్జ్‌తో నెలరోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీగా 2GB డేటా, SMS లను అందించింది.

ఈ ఆఫర్‌ను తొలుత ఆగస్టు నెలాఖరు వరకే ఉంటుందని ప్రకటన చేసింది. అయితే ఈ ప్లాన్‌కు వస్తున్న స్పందన కారణంగా సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. దసరా సందర్భంగానూ అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లపై 2 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Best Mobiles in India

English summary
BSNL to launch 4G network accross the country on september 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X