క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా BSNL సూపర్ ఆఫర్.. కొన్ని రోజులు మాత్రమే..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ( భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) క్రిస్మస్ సందర్భంగా ఇటీవల క్రిస్మస్ బోనంజా ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.1 రీఛార్జ్ కే నెల రోజుల వ్యాలిడిటీ లో ప్లాన్ ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS, రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.
ఈ ఆఫర్ కేవలం కొత్త సిమ్ కార్డులపై మాత్రమే అందిస్తున్నట్లు BSNL తెలిపింది. ఈ ఆఫర్ ఇటీవలే ప్రారంభం కాగా.. ఈనెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. BSNL కార్యాలయాలు సహా ఇతర ఆధీకృత కేంద్రాలను సందర్శించి, ఈ ఆఫర్ ను పొందవచ్చు.

అయితే క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా BSNL మరో ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 24 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తోంది. ఈ వివరాలు X హ్యాండిల్ లో షేర్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.225, రూ.347, రూ.485, రూ.2399 రీఛార్జ్ ప్లాన్ లపై రోజువారీ అదనపు డేటాను పొందవచ్చు.
* రూ.225 రీఛార్జ్ ప్లాన్ :
BSLNL రూ.225 రీఛార్జ్ ప్లాన్ లో (BSNL Rs225 Recharge Plan) భాగంగా ప్రస్తుతం రోజువారీ 2.5GB డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా రోజువారీ 3GB వరకు డేటాను పొందుతారు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
Don’t Miss Out - Don’t Miss Out - Add Extra Joy to Your Christmas with BSNL!
— BSNL India (@BSNLCorporate) December 24, 2025
Enjoy 2.5 GB/day (up from 2 GB) on our most popular plans - ₹347, ₹485, and ₹2399.
Stay connected with high-speed data, unlimited calls, and seamless browsing.
Offer Valid: 24th Dec 2025 - 31st… pic.twitter.com/WULEgcxzZ5
* రూ.347 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs347 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా విషయానికి వస్తే రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. అయితే ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 50 రోజులుగా ఉంది.
* రూ.485 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs485 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ సాధారణంగా రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. అయితే ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది.
* రూ.2399 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs2399 Recharge Plan) భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో సాధారణంగా 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా ప్రతిరోజు 3GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








