తెలంగాణ కేబుల్ ఆపరేటర్లతో చేతులు కలిపిన బీఎస్ఎన్ఎల్

తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింతగా విస్తరించుకునే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందం కుదర్చుకుంటోంది.

తెలంగాణ కేబుల్ ఆపరేటర్లతో చేతులు కలిపిన బీఎస్ఎన్ఎల్

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లలో DVD, VCD ఫైల్స్‌ను రన్ చేయటం ఎలా..?

ఇప్పటికే వరంగల్ జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లతో చేతులు కలిపి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తున్నామని, త్వరలోనే కరీంనగర్ లోనూ ప్రయివేట్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ తెలిపారు.

తెలంగాణ కేబుల్ ఆపరేటర్లతో చేతులు కలిపిన బీఎస్ఎన్ఎల్

Read More : 4జీబి ర్యామ్‌తో Moto M

కరీంనగర్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్న 4000 లైన్లతో కూడిన తరువాతి తరం నెట్‌వర్క్‌తో ల్యాండ్‌లైన్ చందాదారులకు ఐపీ సెంట్రెక్స్, వీడియో కాలింగ్, గ్రూప్ వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి సౌకర్యాలు అదనంగా జతవుతాయని అనంతరామ్ వెల్లడించారు. ఇదే సమయంలో 20 ఉచిత్ వై-ఫై హాట్‌స్పాట్‌లను కూడా మార్చి 15 నాటికి కరీంనగర్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
BSNL to rope in cable operators for providing broadband services. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot