రోజుకి 1జిబి డేటా కాదు, 84 రోజులు పాటు అపరిమితం, ఒక్క దెబ్బతో టెల్కోలకు షాకిచ్చిన BSNL

Written By:

రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు కూల్ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 84 రోజులకుగాను రోజువారీ పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ డేటా అందించే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.1099తో రీచార్జ్ చేసుకుంటే.. 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్‌కు ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నది. ఇది రోజువారి లెక్కన చూస్తే రోజుకు రూ.13తో అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ ఇస్తున్నట్లుగా చెప్పవచ్చు. కాగా ఇండియాలోని అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రోజువారీ, నెలవారీ పరిమితులతో ఆఫర్లు ప్రకటించిన జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్‌కు ఒక్కదెబ్బతో షాకిచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్. అయితే ఇది 3జీ డేటా కావడమే కాస్త ప్రతికూల అంశం. కాగా 4జీ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం కేరళ సర్కిల్‌లోనే ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బిెసఎన్ఎల్ ప్లాన్ల మీద కూడా ఓ లుక్కేయండి

వెంటనే మీ పాస్ వర్డ్ మార్చేయండి.. BSNL హెచ్చరిక!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 429 ప్లాన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వినియోగదారుల కోసం 429 రూపాయలతో ఆకర్షణీయమైన వాయిస్‌, డేటా ఆధారిత ప్లాన్‌ఇది. వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజులపాటు పొందవచ్చు.

రూ.186 ప్లాన్..

రూ.186 ప్లాన్ ద్వారా వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. రోజుకు 1జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

రూ.187 ప్లాన్‌

అదేవిధంగా రూ.187 ప్లాన్‌లో రోజుకు 1జిబి డేటా చొప్పున 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ తో కూడిన ఆఫర్ పొందవచ్చు. ఇందులో ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ పెట్టుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఉచిత రోమింగ్, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి.

రూ.485 ప్లాన్‌

రూ.485 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాకు 90 రోజుల వాలిడిటీ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులుగా ఉంది.

STV

STV-333 STV-333తో రీఛార్జ్ చేసుకున్న వారికి 90 రోజుల పాటు రోజుకు 3జిబి డేటా చొప్పున అన్ లిమిటెడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ కొత్త కష్టమర్లు అలాగే పాతకష్టమర్లు ఉపయోగించుకోవచ్చు STV349 ఇందులో STV349 Dhil Khol Ke Bol ప్లాన్ లో రోజుకు 2జిబి చొప్పున 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL కాల్స్ అపరిమితం. STV395 STV395 Nehle per Dehla ప్లాన్ లో రోజుకు 2జిబి చొప్పున 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL 3000నిమిషాలు వరకు మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు 1800 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. 71 రోజులు వ్యాలిడిటీ

రూ. 666 ప్లాన్

ప్లాన్ రూ. 666 ద్వారా 129 రోజులు పాటు 1.5 జిబి డేటా చొప్పున యూజర్లు అందుకుంటారు. వారికి 129 రోజులు పాటు unlimited local, STD and roaming calls వస్తాయి.

పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల పై రెట్టింపు డేటా..

పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.225 ప్లాన్‌‌కు గాను 200 MB‌కి బదులుగా 1GB డేటాను, రూ.325 ప్లాన్‌‌కు గాను 250 MBకి బదులుగా 2GB డేటాను, రూ. 525 ప్లాన్‌‌కు గాను 500 MBకి బదులుగా 3GB డేటాను, రూ. 725 ప్లాన్‌‌కు గాను 1GBకి బదులుగా 5GB డేటాను, రూ. 799 ప్లాన్‌‌కు గాను 3GB కి బదులుగా 10GB డేటాను పొందవచ్చు.

రూ.99 ప్లాన్

రూ.99 ప్లాన్ క్రింద ఉన్న వినియోగదారులు గతంలో ఎటువంటి డేటా‌ని పొందెవారు కాదు, తాజా రివిజన్ నేపథ్యంలో ఈ ప్లాన్‌లో ఉన్న వారికి 250 MB డేటా లభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL unveils ‘KOOL’ offer to provide unlimited data for 84 days More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot