జియోకి పోటీగా BSNL 3 కొత్త ప్లాన్లు, 90 రోజుల పోస్ట్ పెయిడ్ ప్లాన్

Written By:

దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం BSNL సరికొత్త ప్లాన్లతో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పటికే Airtel, Idea, vodafone లాంటి సంస్థలు జియోతో పోటీనెదుర్కుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ దిగ్గజం జియోకి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ నేఫథ్యంలోనే రూ.118, రూ.379, రూ.551 పేరిట ఈ ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా యూజర్లు ఇతర టెలికాం నెట్ వర్క్ లోకి తరలిపోకుండా ఉంటారని ఈ దిగ్గజం అంచనా వేస్తోంది. ఈ ప్లాన్లతో పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్ కూడా రివైజ్ చేసింది. జియోకి పోటీగా ఇప్పుడు తీసుకువచ్చిన ప్లాన్ల వివరాలేంటో ఓ సారి చూద్దాం.

జియో ప్రైమ్ వద్దనుకుంటున్నారా, అయితే ఈ బెస్ట్ ఆఫర్లు మీ కోసమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 118 ప్లాన్

కస్టమర్లు రూ.118తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. కాగా ఇదే తరహా ప్లాన్ జియోలో రూ.98కి లభిస్తోంది. జియోలో ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటా లభిస్తాయి

రూ.379 ప్లాన్‌

కస్టమర్లు రూ.379తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వాలిడిటీతో 4జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అలాగే BSNL-to-BSNL voice calls రోజుకు 30 నిమిషాల పాటు వాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ జియో రూ.349, రూ.399కి పోటీగా ఉంది.

రూ. 551 ప్లాన్

కస్టమర్లు రూ.551తో రీ ఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. దీంతో ఎలాంటి వాయిస్ కాల్స్ రావు. దీంతో పాటు రూ. 444 ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా 60 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. దీంతో పాటు ఎంపిక చేసిన సర్కిళ్లకు రూ.666 ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రోజుకు 1GB 4G data, unlimited voice calls, 100 SMS messages 129 రోజుల పాటు లభిస్తాయి.

పోస్ట్ పెయిడ్ రూ. 485 ప్లాన్

రోజుకు 1జిబి డేటా చొప్పున unlimited voice calls, 100 SMS messages లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 90 రోజులు. కాగా ఈ మధ్యనే రూ.399 ప్లాన్ లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ద్వారా రోమింగ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే రూ.799 ప్లాన్ ద్వారా 30 జిబి డేటా unlimited voice calls లభిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Unveils Rs. 118, Rs. 379, Rs. 551 Prepaid Packs, Revises Rs. 399 Postpaid Plan More news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot