Just In
- 2 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 7 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
మార్కెట్లోకి BSNL సరికొత్త ఆఫర్
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న BSNL మరో అడుగు ముందుకేసింది. "WINGS " అనే పేరుతో సరి కొత్త ఆఫర్ ను లాంచ్ చేసింది. కాగా సాయి ఇన్ఫోసిస్టమ్ (ఇండియా) లిమిటెడ్ భాగస్వామ్యంతో నెట్ టెలిఫోనీ సేవలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఆఫర్ లో భాగంగా ఇక పై తమ ల్యాండ్ లైన్ చందాదారులకు ప్రీపెయిడ్ కనెక్షన్ తో పాటు అద్దెకు ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ట్రాయ్ గత సంవత్సరం అక్టోబర్లో VoIP గైడ్ లైన్స్ రిఫ్రెష్ చేసిన తర్వాత, ఈ ఏడాది మే నెలలో టెలికాం కమీషన్ ఆమోదించింది. చందాదారులు వారి ల్యాండ్ లైన్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేయడానికి మరియు స్వీకరించడానికి అనుమతించడానికి IMS NGN కోర్ స్విచ్లు IP ఆధారిత యాక్సెస్ నెట్వర్క్ ను ఉపయోగిస్తుంది.VoIP సర్వీస్ కు వన్ టైం ఫ్రీ యాక్టివేషన్ కొరకు రూ.1,099.చెల్లిస్తే చాలు.

గత ఏడాది అక్టోబరులో:
గత ఏడాది అక్టోబరులో ట్రాయ్ దేశంలోని టెలిఫోన్ / VoIP ప్రమాణాలకు గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. BSNL యొక్క మొబైల్ కాలింగ్ యాప్ గురించి కొందరు ఫిర్యాదు చేసిన తర్వాత, ఈ వినియోగదారులు ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ చేయటానికి అనుమతించింది.

వన్ టైం ఫ్రీ యాక్టివేషన్ కొరకు:
వన్ టైం ఫ్రీ యాక్టివేషన్ కొరకు రూ.1,099.చెల్లిస్తే చాలు ఇక పై ఆన్ లిమిటెడ్ వీడియో కాల్స్ మరియు ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. కాగా తక్కువ మొబైల్ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లోని చందాదారులను టార్గెట్ చేస్తూ ఈ ఆఫర్ ను అందిస్తుంది BSNL. ఈ వింగ్స్ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ తో , వినియోగదారులు బ్రాడ్ బ్యాండ్, Wi-Fi, 4G, లేదా 3G ఇంటర్నెట్ ఉపయోగించి కాల్స్ చేయవచ్చు మరియు స్వీకరించవచ్చు. వింగ్స్ తో వింగ్స్ కు మాత్రమే వీడియో కాల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

ప్రస్తుత అడ్రస్ బుక్ ను ఉపయాగించవచ్చు:
యాప్ ద్వారా కాల్ చేసుకోవడానికి ప్రస్తుత అడ్రస్ బుక్ ను ఉపయోగించవచ్చు. సాఫ్ట్ యాప్ లేదా SIP క్లయింట్ ద్వారా ల్యాప్టాప్లు మరియు మొబైల్ ఫోన్లలో కన్ఫిగర్ చేసుకోవచ్చు.

కొత్త కనెక్షన్ల కోసం బుకింగ్ త్వరలో ప్రారంభం:
ఈ పథకం కింద కొత్త కనెక్షన్ల కోసం బుకింగ్ త్వరలో ప్రారంభం కానుంది మరియు వినియోగదారులు అన్ని బిఎస్ఎన్ఎల్ యొక్క అన్ని టెలికాం సర్కిళ్లలో వెంటనే ప్రభావంతో వెయిట్ లిస్ట్ చేయబడతారు. ఆగస్టు 1, 2018 నుండి మొదటి బ్యాచ్ కు సేవలు లభ్యమవుతాయి.

ప్రారంభ ప్యాక్ ధర రూ.200 :
ప్రారంభ ప్యాక్ ధర రూ.200 ఇందులో లోకల్ మరియు ఎస్టీడీలతో సహా అన్ని నెట్వర్క్స్ కు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు .ఇది 30 రోజుల వ్యవధిని కలిగి ఉంది. స్పెషల్ టారిఫ్ వోచర్లు రూ. 11 మరియు రూ. 199 ను అందిస్తుంది అయితే దీని వ్యవధి 1 రోజు మరియు 30 రోజులు మధ్య ఉంటుంది దీనితో భారతదేశంలో ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు.

ప్రీపెయిడ్ ల్యాండ్ లైన్ సర్వీస్ అప్లై చేసుకోవడం కొరకు:
ప్రీపెయిడ్ ల్యాండ్ లైన్ సర్వీస్ అప్లై చేసుకోవడం కొరకు వినియోగదారులు SMS ద్వారానో లేక BSNL CSCs, రిటైలర్ అవుట్ లెట్స్ ద్వారానో పొందవచ్చు. BSNL యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా రీటైలర్ స్టోర్ ద్వారానో ప్యాకేజీల కోసం రీఛార్జ్ చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470