BSNL రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అప్‌గ్రేడ్.. 100Mbps వేగం సహా అధిక డేటా ప్రయోజనాలు..!
ప్రభుత్వ రంగ సంస్థ BSNL సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో (BSNL Broadband Plans) మార్పులు చేసింది. ఫలితంగా వినియోగదారురు అధిక ప్రయోజనాలను పొందనున్నారు. రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో సంస్థ చేసిన మార్పులతో మరింత మందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది. పూర్తి వివరాలు.
BSNL రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు..
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఈ రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 2020 లో (BSNL RS599 Broadband Plan) లాంచ్ చేసింది. విడుదల సమయంలో ఈ ప్లాన్ ద్వారా గరిష్ఠంగా 60Mbps వేగంతో డేటా వినియోగించుకొనే అవకాశం ఉండేది. మరియు 3.3TB నెలవారీ డేటాను పొందవచ్చు. ఈ డేటా పరిమితి అనంతరం 2Mbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ప్లాన్ ను బీఎస్‌ఎన్‌ఎల్ అప్ గ్రేడ్ చేసింది. ఫలితంగా వినియోగదారులు గరిష్ఠంగా 100Mbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. మరియు నెలవారీ 4TB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం తర్వాత వినియోగదారులు 4Mbps వేగంతో డేటా ను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు ఇదే ధరలో బీఎన్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ మరో బేసిక్ ప్లాన్‌ను కలిగి ఉంది. BSNL ఫైబర్ బేసిక్ OTT ప్లాన్‌గా పిలుస్తోంది. ఈ ప్లాన్ ద్వారా 75Mbps వేగం సహా 4TB నెలవారీ డేటాను పొందవచ్చు. దీంతోపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
*ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ రూ.58 మరియు రూ.59 ధరలతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లలో ఒకటి డేటా వోచర్, మరొకటి వ్యాలిడిటీ పొడిగించుకొనే ప్లాన్‌గా ఉంది. అయితే ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లలోనూ డేటా సదుపాయం ఉంది.
రూ.58 రీఛార్జ్ ప్లాన్ : బీఎస్‌ఎన్‌ఎల్ రూ.58 రీఛార్జీతో డేటా ప్లాన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులపాటు ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌ను కోసం యూజర్ యాక్టివ్ బేసిక్ ప్లాన్‌ను కలిగి ఉండాలి. దీని ద్వారా ప్రతి రోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం 40kbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు.
BSNL రూ.59 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీని పెంచుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం సహా రోజుకు 1GB డేటాను పొందవచ్చు. అయితే ఈ రీఛార్జీ ప్లాన్ ద్వారా ఉచిత SMS సదుపాయం లేదని సంస్థ వెల్లడించింది.
*దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఆగస్టు నుంచి 4G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. గత సంవత్సరం జులైలో పంజాబ్‌లో BSNL తన 4G నెట్‌వర్క్ ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం టెలికాం పరిశోధన సంస్థ C-DoT మరియు ఐటీ సంస్థ TCS ల కన్సార్షియం రూపొందించిన స్వదేశీ టెక్నాలజీతోని ఉపయోగించారు.
పంజాబ్ లో సుమారు 8 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ కన్సార్షియం తయారు చేసిన క్లిష్టమైన టెక్నాలజీ పూర్తి స్థాయిలో స్తిరపడేందుకు (Stabilize) 12 నెలల సమయం పడుతుండగా.. కేవలం 10 నెలల్లోనే స్టెబి లైజ్ అయింది.
ఈ ఆత్మనిర్బర్ విధానంలో రూపొందిన ఈ BSNL 4G టెక్నాలజీని సులభంగా 5G అప్‌గ్రేడ్ అయ్యేలా రూపొందించారు. 4G మరియు 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటుచేసేందుకు చేయనున్నారు. ఇందులో భాగంగా 9 వేల టవర్లను ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications








