ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఫేస్‌బుక్ వాడుకోవచ్చు: బీఎస్ఎన్ఎల్
వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉపయుక్తమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫేస్‌బుక్ యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. ఈ సేవను సద్వినియోగం చేసుకునే యూజర్లు... మూడు రోజుల పథకానికి గాను రూ.4, వారం రోజుల పథకానికి గాను రూ.10, నెల రోజుల పథకానికి గాను రూ.20 చెల్లించాల్సి ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

అన్‌స్ట్రక్షర్డ్ సప్టింమెటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్‌డి) టెక్నాలజీ ద్వారా ఫేస్‌బుక్ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్, యూ2ఓపోయా (U2opoia) మొబైల్‌తో ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఈ సర్వీస్ అన్ని రకాల హ్యాండ్‌సెట్‌లను సపోర్ట్ చేస్తుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఈ సేవను ఉపయోగించుకోవటం ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్లు తమ ఫోన్‌లలో ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications