BSNL యూజర్లకు అనువైన మరియు సరసమైన ధరలో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఏకైక టెలికాం ఆపరేటర్ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేట్ టెల్కోలకు విరుద్ధంగా ధరలను పెంచకుండా తన యొక్క వినియోగదారులకు చౌక ధరలోనే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ప్రైవేట్ ఆపరేటర్‌లు 4G సర్వీస్ దేశం అంతటా కలిగి ఉన్నారు. అయితే BSNL ఇప్పటికి కూడా కొన్ని చోట్ల 4G సర్వీసులను కలిగి లేదు. కాకపోతే ఈ సంవత్సరంలోనే 4G సేవలను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

ఈ BSNL టెల్కో అద్భుతమైన ప్రయోజనాలతో సరసమైన ధర ట్యాగ్‌లతో కొన్ని ప్లాన్‌లను అందిస్తుంది. చాలా మంది రెండు సిమ్ లను వినియోగిస్తుంటారు. వీటిలో రెండవ దానిగా BSNL యొక్క సిమ్ ని ఎంచుకోవడం ఉత్తమం. దీని కారణంగా త్వరలో ప్రారంభమయ్యే సేవలతో మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు నీ వంతు సాయం చేసినట్లు కూడా అవుతుంది. BSNL అందించే చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాయిస్ కాల్‌ల ప్రయోజనాలతో BSNL చౌకైన ప్లాన్‌లు
BSNL టెల్కో చౌకైన ధరలో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో మొదటి ప్లాన్ STV_49 ప్లాన్. రూ.49 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 24 రోజుల చెల్లుబాటు కాలానికి 2GB డేటాతో పాటు 100 నిమిషాల వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. జాబితాలోని మరోక ప్లాన్ BSNL యొక్క STV_99 ప్యాక్ రూ.99 ధర వద్ద 22 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. మరొకటి Voice_135 ప్యాక్ కూడా రూ.135 ధరతో 24 రోజుల చెల్లుబాటు కాలానికి 1440 నిమిషాల వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది.

డేటా ఆఫర్‌లతో BSNL చౌకైన ప్లాన్‌లు
డేటా ఆఫర్‌లతో చౌకైన ధరలో లభించే BSNL యొక్క ప్యాక్‌ల విషయానికి వస్తే మొదటిది BSNL STV_118 ప్లాన్. రూ.118 ధరతో లభించే ఈ ప్లాన్ 26 రోజుల చెల్లుబాటు వ్యవధికి అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 0.5GB డేటాను అందిస్తుంది. మరోకటి STV_147 ప్యాక్ కూడా రూ.147 ధరతో అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు మొత్తం 10GB డేటాను 30 రోజుల చెల్లుబాటు కాలానికి BSNL ట్యూన్‌ల ఉచిత యాక్సెస్‌తో పాటుగా అందిస్తుంది.

BSNL టెల్కో చౌకైన ధరలో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో తరువాతది STV_185 ప్లాన్. ఇది 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 1GB డేటా ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ BSNL ట్యూన్‌లకు కూడా ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. తరువాతది టెలికాం యొక్క వాయిస్_187 ప్యాక్. ఇది 28 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 2GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

BSNL టెల్కో రూ.97 ధర వద్ద అందించే STV_97 ప్యాక్ 18 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే DataTSunami_98 మరొక డేటా ప్లాన్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇది రూ.98 ధర వద్ద 22 రోజుల చెల్లుబాటు వ్యవధికి 2GB/రోజు ఆఫర్ చేస్తుంది. టెల్కో యొక్క మరొక డేటా ప్లాన్ Data_WFH_151 ప్యాక్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి 40GB డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ అదనంగా Zing యాక్సెస్‌తో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications








