Home
News

COVID-19, సైక్లోన్ కష్టకాలంలో BSNL ఉచిత ఆఫర్లు ఇవే...

COVID-19 కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి మరియు తకుటే సైక్లోన్ లతో బాధపడుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ టెల్కో బిఎస్ఎన్ఎల్ కొన్ని ఉచిత ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆపరేటర్ ప్లాన్ వోచర్లు (PVs) వాలిడిటీ పొడగింపు మరియు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్లను అందించనుంది. PV వోచర్లలోని ఉచిత పొడిగింపు యొక్క ప్రయోజనం మే 31, 2021 వరకు వర్తిస్తుంది. ఇది వినియోగదారులు వారి సిమ్ కార్డులను రీఛార్జ్ చేయలేక పోయినప్పటికీ కాల్స్ స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఉచిత పొడిగింపును స్వీకరించే BSNL PV ప్లాన్లు

ఉచిత పొడిగింపును స్వీకరించే BSNL PV ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ టెల్కో ప్రస్తుతం అందిస్తున్న ఉచిత పొడిగింపును మూడు PVలు అందుకుంటాయి. వీటిలో PV 107, PV 197 మరియు PV 397 వంటివి ఉన్నాయి. ఈ ప్రయోజనం PVల చెల్లుబాటు ఏప్రిల్ 1, 2021 తో ముగుస్తుందని భావిస్తున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

BSNL

BSNL PV107 ప్లాన్ 100 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 60 రోజుల వాలిడిటీకి బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ను మరియు మొత్తంచెల్లుబాటు కాలంలో 3GB డేటాను అందిస్తుంది. PV197 ప్లాన్ 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2GB రోజువారీ డేటాతో పాటు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS / day తో పాటు 18 రోజుల పాటు BSNL ట్యూన్స్ మరియు జింగ్ మ్యూజిక్‌లను ఉచితంగా అందిస్తుంది. చివరగా PV397 ప్లాన్ 365 రోజులు (1 సంవత్సరం) చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2GB రోజువారీ డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS / day లతో అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులు 60 రోజుల పాటు బిఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ మరియు లోక్‌ధమ్ కంటెంట్‌ను కూడా ఉచితంగా పొందుతారు.

బిఎస్ఎన్ఎల్

ప్రస్తుత అనిశ్చిత సమయాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి వినియోగదారులకు సహాయపడటానికి బిఎస్ఎన్ఎల్ 100 నిమిషాల వాయిస్ కాలింగ్ను ఇప్పుడు ఉచితంగా అందిస్తుంది. COVID-19 మహమ్మారి యొక్క కఠినమైన పరిస్థితిని ఎదుర్కోవడంలో వినియోగదారులకు సహాయపడటానికి ఉచిత ప్రయోజనాలను అందించడంలో ఇప్పటికే రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు ముందున్నాయి. ఈ సంస్థలను అనుసరిస్తూ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా తన యొక్క యూజర్లకు ఉచిత ఆఫర్లను ప్రకటించింది.

జియో,ఎయిర్‌టెల్,Vi ఉచిత ఆఫర్లు

జియో,ఎయిర్‌టెల్,Vi ఉచిత ఆఫర్లు

జియోఫోన్ వినియోగదారులు ఏదైనా ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే కనుక బయ్-వన్-గెట్-వన్ ఆఫర్‌ను అందిస్తుంది. దీనితో పాటుగా జియో 300 నిమిషాల వాయిస్ కాలింగ్లను కూడా ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ మరియు Vi టెల్కోలు రెండూ కూడా తక్కువ ఆదాయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూ.49 ప్యాక్‌ను ఉచితంగాను మరియు రూ.79 ప్యాక్‌ కొనుగోలు మీద డబుల్ బెనిఫిట్‌లను అందిస్తున్నాయి. లాక్డౌన్లు మరియు తుఫాను కారణంగా వారి సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడానికి బయటకు వెళ్ళలేని మరియు ఆన్‌లైన్‌లో కూడా రీఛార్జ్ చేయలేని వినియోగదారులకు ఈ ఉచిత ప్రయోజనాలు ఖచ్చితంగా సహాయపడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Users Will Get Validity Extension on Plan Vouchers and More Free Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X