రూ.26తో 26 గంటలు మాట్లాడుకోండి

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, గతంలో లాంచ్ చేసిన కొన్నిప్రమోషనల్ ఆఫర్లకు తాలుకా వ్యాలిడిటీ పిరియడ్‌ను మరో 90 రోజుల పాటు పొడిగించింది. అదనపు వ్యాలిడిటీ పిరియడ్‌ను అందుకున్న ప్లాన్‌లలో STV 26 ప్యాక్ కూడా ఉంది.

Read More : నోకియా ఫోన్‌లు ఈ నెలలోనే వచ్చేస్తున్నాయ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

26 గంటల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా...

ఈ ప్రమోషనల్ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.26 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా 26 గంటల పాటు తమ హోమ్ సర్కిల్ పరిధిలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకునే వీలుంటుంది.

ఏప్రిల్ 1, 2017 నుంచి..

STV 26 ప్యాక్ సంబంధించిన అదనపు వ్యాలిడిటీ పిరియమ్ ఏప్రిల్ 1, 2017 నుంచి ప్రారంభమైంది. జూన్ వరకు ఈ ప్రమోషనల్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

వొడాఫోన్ కూడా ఇదే బాటలో..

బీఎస్ఎన్ఎల్ తరహాలోనే వొడాఫోన్ కూడా ఇలాంటి ఆఫర్‌నే అందిస్తోంది. వొడాఫోన్ యూజర్లు రూ.7 చెల్లించటం ద్వారా గంట పాటు అపరిమితంగా కాల్స్ చేసుకునే వీలుంటుంది. అయితే ఈ కాల్స్ వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య మాత్రమే.

బీఎస్ఎన్ఎల్ రూ.339 ప్లాన్‌

జియోను ప్రైమ్ ఆఫర్‌ను టార్గెట్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఇటీవల రూ.339 ప్లాన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్లాన్‌లో భాగంగా రోజుకు 2జిబి డేటాతో అన్‌లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు రోజుకు 25 నిమిషాల ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత చేసుకునే ప్రతి కాల్‌కు 25 పైసలు వసూలు చేస్తారు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1. 2017 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Voice Calls for 26 Hours at Just Rs.26. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot