BSNL, Airtel బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో మెరుగైన ప్రయోజనాలు ఎందులో ఉన్నాయి??
బిఎస్ఎన్ఎల్ మరియు భారతి ఎయిర్టెల్ టెలికాం సంస్థలు రెండూ కూడా తమ సొంత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్లను కలిగి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ పేరుతో తన బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, ఎయిర్టెల్ టెల్కో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేరుతో తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్ ను నిర్వహిస్తోంది. ఈ రెండు కంపెనీలు కూడా చాలా కాలంగా ఇండియన్ మార్కెట్లో తన యొక్క వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నాయి.

అలాగే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను కొత్త వారు పొందడం కోసం వారిని ఆకర్షించడానికి అనేక ప్లాన్లను విడుదల చేసారు. భారతి ఎయిర్‌టెల్ బిఎస్‌ఎన్‌ఎల్ కంటే చాలా ముందుగానే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టగా స్టేట్-రన్ ఆపరేటర్ కూడా తన యొక్క బిజినెస్ ను తక్కువ కాలంలోనే పెంచుకుంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ మాదిరిగానే బిఎస్ఎన్ఎల్ కూడా తన మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందించడం ప్రారంభించింది. ఈ రెండు సంస్థల నుండి లభించే సారూప్యమైన ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ & ఎయిర్టెల్ సారూప్య బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు
బిఎస్ఎన్ఎల్ మరియు ఎయిర్‌టెల్ సంస్థలు రెండూ కూడా ఒకే ధర వద్ద మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.799, రూ.999 మరియు రూ.1,499 లుగా కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలు తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో వినియోగదారులకు మెరుగైన డేటా ప్రయోజనాలను అందించడంతో పాటుగా ల్యాండ్‌లైన్ కనెక్షన్ తో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి.

రెండు బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు రూ.799 ధర వద్ద అందించే ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే బిఎస్‌ఎన్‌ఎల్ 3.3TB ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాతో వినియోగదారులకు 100Mbps వేగాన్ని అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ కూడా అదే 100Mbps స్పీడ్‌ను అందిస్తుంది. అయితే 3,333GB కొంచెం ఎక్కువ డేటాతో. ఎయిర్‌టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ రెండింటి ప్లాన్లతో ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉంది. ఏదేమైనా ఎయిర్టెల్ తో పోలిస్తే BSNL తన వినియోగదారులకు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందించదు. అయితే ఎయిర్టెల్ మాత్రం 100 Mbps ప్లాన్‌తో తన వినియోగదారులలకు ఇతర ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, షా అకాడమీ మరియు వింక్ మ్యూజిక్ వంటి OTT ప్రయోజనాలను అందిస్తుంది.

రెండు ఆపరేటర్లు రెండవ ప్లాన్ ను రూ.999 ధర వద్ద అందిస్తాయి. ఎయిర్టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ రెండింటి నుండి రూ .999 ప్లాన్ 200 Mbps వేగంతో వస్తుంది. ఈ ప్లాన్‌లు అందించే డేటా కూడా పై దాని వలె 3.3TB ను కలిగి ఉంటాయి. కానీ ఎయిర్‌టెల్ 33GB అదనపు డేటాను ఇవ్వడం ద్వారా ముందంజలో ఉంది. అలాగే వినియోగదారులకు కంపెనీల యొక్క ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈసారి బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం యొక్క OTT ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపితో పాటు ఇతర ఎయిర్టెల్ థాంక్స్ వంటి OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

చివరగా రూ.1,499 ధర వద్ద లభించే ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే రెండు కంపెనీలు 300 Mbps వేగంతో లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ 4TB డేటాను అందిస్తుండగా భారతి ఎయిర్‌టెల్ 3.3TB డేటాను మాత్రమే అందిస్తుంది. OTT ప్రయోజనాలతో ల్యాండ్‌లైన్ కనెక్షన్ రెండు ప్రణాళికల్లో చేర్చబడింది. బిఎస్ఎన్ఎల్ డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం ప్రయోజనాన్ని అందిస్తుండగా, భారతి ఎయిర్టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్ VIP మరియు ఇతర ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలను అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ మరియు భారతి ఎయిర్టెల్ రెండూ ఒకే రకమైన ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను తమ వినియోగదారులకు అందిస్తున్నాయి. ఆదర్శవంతంగా మీకు ఎక్కువ OTT ప్రయోజనాలు కావాలంటే కనుక ఎయిర్టెల్ ను ఎంచుకోవచ్చు. మీరు BSNL యొక్క సేవలను ఇష్టపడితే కనుక మరియు దానితో స్థిరపడగలిగితే ప్రభుత్వ నిర్వహణ ఆపరేటర్ కూడా మెరుగైన సేవలను అందిస్తున్నది. ఇది మీరు వెళ్లాలనుకుంటున్న సంస్థపై ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications