దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలలో ప్రైవేట్ టెల్కోలను వెనక్కి నెట్టిన BSNL

|

ఇండియా యొక్క టెలికాం రంగంలో ఒకప్పుడు రారాజులాగా ఎదిగిన బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడలేక ఒకానొక దశలో దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రభుత్వ జోక్యంతో మళ్ళి పుంజుకొని తన వినియోగదారులకు అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇది ఇటీవల తన రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును పొడిగించింది. ఇంతకుముందు ఇది 365 రోజులతో లభించేది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ 425 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి లభించే రూ.1,999 ప్లాన్‌తో పోల్చితే జియో, ఎయిర్‌టెల్, మరియు Vi(వోడాఫోన్ ఐడియా) ఏమి అందిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. VI (వోడాఫోన్ ఐడియా) రూ.2,595 ధర వద్ద, ఎయిర్టెల్ రూ.2,498 ధర వద్ద, మరియు జియో రూ.2,121 ధర వద్ద లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్‌లు బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,999 ధర వద్ద లభించే ప్లాన్‌తో పోలిస్తే ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 3GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్ (ప్రతిరోజూ 250 నిమిషాల FUP), మరియు రోజుకు 100SMS ప్రయోజనా‌లను అందిస్తుంది. దీనితో పాటు లోక్‌ధమ్ కంటెంట్‌తో 365 రోజులు వినియోగదారుడు కోరుకున్నన్ని సార్లు కాలర్ ట్యూన్‌ను మార్చే అవకాశం కూడా ఉంది. వీటితో పాటుగా 2 నెలల EROS Now చందాను అదనపు ప్రయోజనాల కింద పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు మునుపటి 365 రోజుల నుండి 425 రోజులకు మార్చబడింది.

Also Read: Flipkart లో దీపావళి ఆఫర్లు ! భారీగా ధర తగ్గిన ఫోన్లు ఇవే ..! లిస్ట్ చూడండి.Also Read: Flipkart లో దీపావళి ఆఫర్లు ! భారీగా ధర తగ్గిన ఫోన్లు ఇవే ..! లిస్ట్ చూడండి.

Vi(వోడాఫోన్ ఐడియా) రూ.2,595 ప్లాన్ ప్రయోజనాలు
 

Vi(వోడాఫోన్ ఐడియా) రూ.2,595 ప్లాన్ ప్రయోజనాలు

Vi(వోడాఫోన్ ఐడియా) సంస్థ తన వినియోగదారులకు రూ.2,595 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాతో పాటుగా అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ZEE5 ప్రీమియం, Vi మూవీస్ & టీవీ OTT యాప్ లకు 1-సంవత్సరం పాటు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వీటితో పాటు MPL లో నగదు బోనస్ మరియు జోమాటో నుండి ఆర్డరింగ్‌పై తగ్గింపు వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్లాన్ ఇప్పుడు Vi యొక్క ‘వీకెండ్ డేటా రోల్ఓవర్' ఆఫర్‌తో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు.

రిలయన్స్ జియో రూ .2,121 లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ .2,121 లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో నుండి రూ .2,121 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దానితో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 12,000 ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) నిమిషాలు మరియు రోజుకు 100SMS‌లతో పాటు రోజువారి 1.5GB డేటా ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తుంది.

Also Read: టాటా స్కైలో ఈ ఛానెల్‌లను కొత్త స్లాట్‌లకు తరలించారు!!! గమనించారా...Also Read: టాటా స్కైలో ఈ ఛానెల్‌లను కొత్త స్లాట్‌లకు తరలించారు!!! గమనించారా...

ఎయిర్‌టెల్ రూ .2,498 లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ రూ .2,498 లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ నుండి రూ .2,498 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటా మరియు భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచిత హెలొటూన్స్, వింక్ మ్యూజిక్, 1సంవత్సరం షా అకాడమీకి ఉచిత ప్రవేశం మరియు ఫాస్టాగ్ లావాదేవీపై రూ.150 క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు.

బిఎస్ఎన్ఎల్ vs ఎయిర్‌టెల్ vs జియో vs VI దీర్ఘకాలిక ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ vs ఎయిర్‌టెల్ vs జియో vs VI దీర్ఘకాలిక ప్లాన్‌లు

పైన తెలిపిన ప్లాన్‌లలో వినియోగదారులు పొందే అన్ని రకాల ప్రయోజనాలలో వాలిడిటీని మరియు ధరను మాత్రమే పరిశీలిస్తే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1999 ప్లాన్ అన్నిటికన్నా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది అందిరితో పోల్చి చూస్తే చౌకగా ఉంటుంది మరియు ఎక్కువ డేటాను అందిస్తుంది. కానీ ఒకే సమస్య ఏమిటంటే ఇది 3G డేటాను కలిగి ఉంటుంది. అయితే ఇతర ఆపరేటర్లు తమ దీర్ఘకాలిక ప్లాన్‌లను 4G డేటాతో అందిస్తున్నారు. అందువల్ల మీరు ఇంకా 3Gని ఉపయోగించడం సంతోషంగా ఉంటే మీరు గరిష్ట ప్రయోజనాలను పొందడానికి బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL vs Airtel vs Jio vs VI Long-Term Prepaid Plans: Which One is Better

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X