Home
News

BSNL Vs Jio ఈ రెండింటిలో 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లలో ఏది బెస్ట్‌..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL.. ప్రైవేటు టెలికాం ప్రొవైడర్‌లకు గట్టిపోటీనిస్తోంది. ఈ సంవత్సరం జులైలో జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచాయి. దీంతో BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్ లిమిటెడ్‌) వైపు అనేక మంది యూజర్లు మొగ్గుచూపుతున్నారు. జులై నుంచి వరుసగా అన్ని నెలలపాటు లక్షలాది కొత్త యూజర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ సంపాదించుకుంది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌, Vi భారీ స్థాయిలో యూజర్లను కోల్పోయాయి. దీంతోపాటు తక్కువ ధరకే మొబైల్ రీఛార్జ్‌లు అందిస్తుండడం కూడా BSNL యూజర్లు పెరిగేందుకు కారణం.

ప్రస్తుతం BSNL, జియో టెలికాం సంస్థలు 70 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్‌ ప్లాన్‌లను (BSNL 70 Days Validity Recharge Plan) కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్లాన్‌ల ప్రయోజనాల్లో (BSNL Vs Jio) భారీ వ్యత్యాసం ఉంది. కాలింగ్‌, SMS, డేటా సహా ఇతర ప్రయోజనాల్లో తేడాలను గుర్తించవచ్చు. జియో రూ.666 ప్లాన్‌లో (Jio 70 Days Validity Recharge Plan) 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తుండగా.. BSNL కేవలం రూ.197 కే 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

BSNL Vs Jio

BSNL రూ.197 రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ (BSNL RS197 Recharge Plan) ద్వారా 70 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 15 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ SMS లను వినియోగించుకోవచ్చు. అలాగే 15 రోజులపాటు మాత్రమే రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.

మిగిలిన వ్యాలిడిటీ సమయంలో సిమ్ కార్డు కేవలం యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సమయంలో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయాన్ని పొందవచ్చు. సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంచేందుకు లేదా BSNL ను రెండో సిమ్‌ కార్డుగా వినియోగించేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

జియో రూ.666 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ (Jio RS666 Recharge Plan) ద్వారా 70 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ను పొందవచ్చు. రోజువారీ 1.5GB డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ వంటి యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.

ఎక్కువగా డేటా సహా కాలింగ్‌, SMS వినియోగించుకొనే వారికి జియో రీఛార్జ్‌ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు. అయితే BSNL యూజర్లు తన సిమ్‌ కార్డును యాక్టివేట్‌గా ఉంచుకొనేందుకు మాత్రమే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

ధరల పెంపు అనంతరం ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా యూజర్లను కోల్పోతున్నాయి. అదే సమయంలో BSNL భారీ స్థాయిలో యూజర్లను సంపాదించుకుంటోంది. టెలికాం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత రెండు నెలల్లో 65 లక్షలకు పైగా యూజర్లు BSNL నెట్‌వర్క్‌లో చేరారు. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు 40 లక్షల యూజర్లను కోల్పోయాయి. ధరల పెంపు సహా అనేక కారణాలు.. యూజర్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
BSNL Vs Jio which is the best 70 days validity recharge plan check data and benefits full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X