Home
News

జియోతో పోటీపడుతున్న BSNL!! గెలుపు ఎవరిదో తెలుసా??

ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన యొక్క పూర్వవైభవం పొందడం కోసం ప్రైవేట్ టెల్కోలకు పోటీగా మెరుగైన ప్రయోజనాలతో కొత్త ప్లాన్లను రూపొందించడంలో వెనక్కి తగ్గడం లేదు. అందులో భాగంగా రూ.200 ధరలోపు డేటా ప్లాన్‌ల కోసం చూస్తున్న వినియోగదారుల కోసం అనేక ఆఫర్లను అందిస్తున్నది. భారతీయ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) మరియు రిలయన్స్ జియోలకు పోటీగా BSNL ఆపరేటర్ రూ.200 లోపు ధర 4G డేటా ప్లాన్‌లను జియోకు వ్యతిరేకంగా ఎలా అందిస్తున్నదో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.200 ధరలోపు బిఎస్ఎన్ఎల్ ఉత్తమమైన 4G డేటా ప్లాన్‌లు

రూ.200 ధరలోపు బిఎస్ఎన్ఎల్ ఉత్తమమైన 4G డేటా ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ టెల్కో 200 రూపాయల ధరలోపు ‘STV_198' 4G డేటా ప్లాన్ ఉత్తమంగా ఉంది. ఈ వోచర్ BSNL పనిచేసే అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. ఏదేమైనా ఆపరేటర్‌కు ఎప్పుడైనా అది ఎంచుకున్న సర్కిల్‌ల నుండి తొలగించే అధికారం ఉంది. అయితే ఈ వోచర్ రూ.198 ధర వద్ద 54 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ వోచర్‌తో కాలింగ్ ప్రయోజనాలు లేవు కాబట్టి మీరు కాలింగ్ ప్రయోజనాలను వినియోగించుకోవాలనుకుంటే కనుక మీకు ఇప్పటికే బేస్ వాయిస్ కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్లాన్ యాక్టివ్ ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ వోచర్ ఉచిత బిఎస్‌ఎన్‌ఎల్ కాలర్ ట్యూన్‌లతో పాటు వినియోగదారులు 2GB రోజువారీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో యూజర్లు మొత్తం చెల్లుబాటు కాలానికి 108GB 4G డేటాను పొందుతారు.

రూ.200 ధరలోపు జియో ఉత్తమమైన 4G డేటా ప్లాన్‌

రూ.200 ధరలోపు జియో ఉత్తమమైన 4G డేటా ప్లాన్‌

రూ.200 లోపు రిలయన్స్ జియో ఉత్తమమైన 4G డేటా ప్లాన్ రూ.151 ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు మొత్తంగా 30GB 4G డేటాను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ వోచర్ అసాధారణమైనదిగా 30 రోజుల స్వతంత్ర వాలిడిటీతో లభిస్తుంది. అయితే ఇది వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందివ్వదు. దీనికి స్వతంత్ర యాక్సిస్ ఉన్నందున ఇది జియో యొక్క అపరిమిత బేస్ ప్లాన్ లేకుండా కూడా పనిచేయగలదు.

జియో vs బిఎస్ఎన్ఎల్: ఏ ఆపరేటర్ గెలిచారు?

జియో vs బిఎస్ఎన్ఎల్: ఏ ఆపరేటర్ గెలిచారు?

రిలయన్స్ జియో మరియు BSNL టెల్కోలు అందించే 4G డేటా ప్లాన్‌లలో ఉత్తమమైనది ఏది అని అంచనా వేయడం చాలా కష్టం. ఎవరికైనా కేవలం 30GB డేటా మాత్రమే అవసరమైతే కనుక BSNL యొక్క ‘STV_198' కోసం వెళ్ళడంలో అర్థం లేదు. జియో విషయంలో రూ.160 - రూ.200 బ్రాకెట్‌లో 4G డేటా ప్లాన్ ఏమి లేదు. వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. BSNL VoLTE నెట్‌వర్క్ కంటే జియో 4G నెట్‌వర్క్‌ మెరుగ్గా ఉంది.

Best Mobiles in India

English summary
BSNL VS Jio: Which Telco Offers More Benefits Under Rs.200 4G Data Voucher Plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X