8K వీడియో స్ట్రీమింగ్ కోసం అనువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు...

|

స్ట్రీమింగ్ సర్వీసులు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌ల నాణ్యత వేగంగా పెరుగుతోంది.వీటి యొక్క స్థిరమైన యాక్సిస్ కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం ఎంతగానో ఉంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) వివిధ రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ ఉత్తమమైన పిక్చర్ నాణ్యతతో సున్నితమైన స్ట్రీమింగ్ అనుభవాన్ని పొందడానికి అధిక వేగంతో లభించే ప్లాన్‌ల అవసరం ఉంటుంది. వాస్తవానికి ఈ ప్లాన్‌లు ఒకేసారి బహుళ పరికరాలను సజావుగా కనెక్ట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తాయి. ఇటువంటివి ఆఫీస్ లేదా ఒకే కుటుంబంలో ఉన్న వారికి అనువుగా ఉంటాయి. భారతదేశంలో సర్వీస్ ప్రొవైడర్లు 300 Mbps హై-స్పీడ్ వేగంతో అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు గరిష్టంగా 8K వీడియో స్ట్రీమింగ్ కోసం అనువుగా ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి.

Airtel 300 Mbps ప్లాన్

Airtel 300 Mbps ప్లాన్

ఎయిర్టెల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 300 Mbps వేగంతో యూజర్లకు అపరిమిత డేటా ప్లాన్‌ను అందిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్ మరియు షా అకాడమీతో పాటుగా 'ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్'ప్రయోజనాలను పొందుతారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే 'ప్రొఫెషనల్' ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ని పొందవచ్చు. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను నెలకు రూ.1,499 ధరతో పొందవచ్చు. ఈ ప్లాన్ 300 Mbps వేగంతో 3500GB లేదా 3.5TB FUP హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది.

BSNL 300 Mbps ప్లాన్

BSNL 300 Mbps ప్లాన్

దేశంలోని ప్రధాన ISPలలో ఒకటైన ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కూడా 300 Mbps ప్లాన్‌ను అందిస్తుంది. ఇది టెల్కో అందించే అత్యంత హై-ఎండ్ ప్లాన్ ‘ఫైబర్ అల్ట్రా' పేరుతో లభిస్తుంది. ఇది నెలకు రూ.1,499 ధర ట్యాగ్‌తో వస్తుంది. వినియోగదారులు 300 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో 4000GB డేటాను అందిస్తుంది. ఈ FUP డేటా తరువాత స్పీడ్ 4 Mbpsకి తగ్గించబడుతుంది. BSNL నుండి ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్యాక్‌కి ఉచితంగా యాక్సెస్‌తో కూడా వస్తుంది.

Jio 300 Mbps ప్లాన్

Jio 300 Mbps ప్లాన్

జియోఫైబర్ అద్భుతమైన తన యొక్క వినియోగదారులకు అదనపు ప్రయోజనాలతో కూడిన ఆకర్షణీయమైన 300 Mbps ప్లాన్‌ను అందిస్తుంది. జియోఫైబర్ అందించే ఈ ప్లాన్ నెలకు రూ.1,499 (30 రోజులు) ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ ప్లాన్ FUP డేటా పరిమితితో 3.3TB లేదా 3300GBను 300 Mbps ఇంటర్నెట్ వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ మరియు 300 Mbps వద్ద సమానమైన అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్ సెట్‌ను కూడా అందిస్తుంది. జియోఫైబర్ అదనంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు పదమూడు ఇతర వాటికి యాక్సెస్‌తో సహా టన్నుల OTT సభ్యత్వాలను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL VS Jiofiber VS Airtel: These Broadband plans Suitable For 8K Video Streaming

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X