BSNL కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో జియోను మించిన ప్రయోజనాలు

|

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన BSNL తన యొక్క పూర్వవైభవాన్ని పొందడానికి అద్భుతమైన ప్లాన్‌లను విడుదల చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇటీవల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను రూ.199 ఎంట్రీ లెవల్ ధర వద్ద ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ యొక్క ధరను సూచించినట్లుగా రిలయన్స్ జియో నుండి లభించే రూ.199 ప్లాన్‌కు గట్టి పోటీని ఇస్తున్నది.

BSNL vs JIO పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

BSNL vs JIO పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లు ఇటీవల ప్రారంభించే వరకు జియో కేవలం ఒకే ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. రూ.199 ధర వద్ద లభించే రిలయన్స్ జియో మరియు బిఎస్ఎన్ఎల్ యొక్క రెండు ప్లాన్‌లు ప్రతి నెలా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS మరియు 25GB డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. కానీ అదనపు ప్రయోజనాలలో కొన్ని తేడాలను కలిగి ఉన్నాయి. టెల్కోస్ రెండూ కూడా ఎటువంటి OTT చందాలు లేదా కుటుంబ యాడ్-ఆన్‌ల ప్రయోజనాలను అందించడం లేదు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

రిలయన్స్ జియో సంస్థ రూ.199 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది మరియు ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయబడతాయి అలాగే రోజుకు 100 SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో ఎటువంటి రోజువారీ డేటా పరిమితి లేకుండా 25GB 4G డేటాను కలిగి ఉంది. వినియోగదారునికి కేటాయించిన నెలవారీ 25GB డేటా అయిపోయిన తరువాత అదనంగా రూ.20 చెల్లించి 500GB వరకు డేటాను పొందవచ్చు. చివరగా వినియోగదారులు ఒక నెల వరకు జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

Also Read: నవంబర్ 10 న లాంచ్ కానున్న Honor 10X లైట్ ! ఫీచర్లు చూడండి.Also Read: నవంబర్ 10 న లాంచ్ కానున్న Honor 10X లైట్ ! ఫీచర్లు చూడండి.

BSNL రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

BSNL రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ సంస్థ రూ.199 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో పాటుగా 25GB రోల్‌ఓవర్‌తో పాటుగా డేటా బెనిఫిట్ 75GB వరకు మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. జియో మాదిరిగా కాకుండా బిఎస్ఎన్ఎల్ 300 నిమిషాల ఆఫ్-నెట్ కాలింగ్ ను కూడా అందిస్తోంది.

BSNL vs JIO రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్?

BSNL vs JIO రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్?

బిఎస్ఎన్ఎల్ మరియు జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రెండూ ఒకే విధమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో ఆఫ్-నెట్ నిమిషాలు మరియు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం వంటి కొన్ని ప్రయోజనాలు అదనంగా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లను 2020 డిసెంబర్ 1 న ప్రారంభించబోతోంది. అంతకుముందు ప్రభుత్వ టెల్కో పోస్ట్ పెయిడ్ ప్లాన్లను రూ.99 మరియు రూ.225 ధరల వద్ద అందించేది.

బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ యాడ్-ఆన్‌ల ప్రయోజనాలతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ యాడ్-ఆన్‌ల ప్రయోజనాలతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ సంస్థ వచ్చే నెలలో ఫ్యామిలీ యాడ్-ఆన్‌లు, డేటా రోల్‌ఓవర్ వంటి మరిన్ని అదనపు ప్రయోజనాలతో రూ.798 మరియు రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా తీసుకువస్తోంది. దాదాపు మూడేళ్ల తరువాత బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ విభాగంలో తన యొక్క చాతుర్యతను ముమ్మరం చేస్తోంది. అయితే 4G సేవలు లేకపోవడం అనేది టెల్కోను దెబ్బతీస్తూనే ఉంటుంది. రూ.798 మరియు రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో బిఎస్‌ఎన్‌ఎల్ ఒటిటి చందాలను కూడా ఇవ్వవచ్చు. ఫ్యామిలీ యాడ్-ఆన్ ప్రయోజనంతో రూ .525 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను కూడా ఇది సవరించింది.

Best Mobiles in India

English summary
BSNL vs Reliance Jio: Rs.199 Entry-Level Postpaid Plans Compared

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X