Vi, Jio, Airtel యొక్క ప్లాన్‌లను మించిన ప్రయోజనాలతో బిఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్
ఇండియాలోని ఏకైక ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఇటీవల రూ.447 ధర వద్ద ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఈ బిఎస్ఎన్ఎల్ టెల్కో ఈ ప్లాన్‌తో రోజువారీ ఎఫ్‌యుపి పరిమితులు లేకుండా మొత్తం డేటాను వినియోగించుకోవడానికి వినియోగదారులను అనుమతించనున్నది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలు వోడాఫోన్ ఐడియా (Vi), రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ సంస్థలు అందించే ప్రయోజనాల కంటే మెరుగ్గా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ అందించే ఆఫర్స్ జియో, Vi మరియు ఎయిర్‌టెల్ కంటే మెరుగ్గా ఉన్నాయని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్ ప్రయోజనాలు
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన రూ.447 ప్రీపెయిడ్ ప్లాన్ 60 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ మొత్తం చెల్లుబాటు కాలంలో వినియోగదారులు ఎటువంటి రోజువారీ డేటా పరిమితులు లేకుండా మొత్తంగా 100GB డేటాను వినియోగించడానికి అనుమతిని ఇస్తుంది. ఇంతేకాకుండా వినియోగదారులు ఈరోస్ నౌ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ యొక్క ఓవర్-ది-టాప్ (OTT) లకు ఉచిత యాక్సిస్ ను పొందవచ్చు. ఈ ప్రయోజనాలతో పాటుగా మొత్తం చెల్లుబాటు కాలంలో 100 SMS / day మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రిలయన్స్ జియో రూ 447 ప్లాన్ ప్రయోజనాలు
రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న అదే రూ.447 ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఈ ప్లాన్ 60 రోజుల చెల్లుబాటు కాలానికి 50GB మొత్తం డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా JioNews, JioSecurity, JioCinema, JioCloud మరియు JioTV వంటి జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS / day వంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. డేటా వినియోగంపై ఎటువంటి రోజువారీ పరిమితులు లేవు.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.447 ప్లాన్ ప్రయోజనాలు
వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థ కూడా తన వినియోగదారులకు రూ.447 అదే ధర వద్ద రిలయన్స్ జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. Vi టెల్కో కూడా ఈ ప్లాన్‌ను 60 రోజుల చెల్లుబాటు కాలానికి వినియోగదారులకు 50GB డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌పై కూడా ఏటువంటి రోజువారీ డేటా పరిమితి లేదు. ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు అదనంగా ఉన్నాయి. వీటితో పాటుగా వినియోగదారులు Vi మూవీస్ & టీవీ క్లాసిక్‌కు ఉచిత యాక్సిస్ ను పొందుతారు.

భారతి ఎయిర్‌టెల్ రూ .456 ప్లాన్ ప్రయోజనాలు
భారతి ఎయిర్‌టెల్ కూడా తన వినియోగదారులకు ఇలాంటి ప్లాన్‌ను అందిస్తుంది. అయితే స్వల్ప వ్యత్యాసంతో రూ.456 ధర వద్ద అందిస్తుంది. ఇది పైన పేర్కొన్న రూ.447 ప్లాన్‌ల కంటే రూ.9 ఎక్కువ ధరను కలిగి ఉంది. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 60 రోజుల చెల్లుబాటు కాలానికి 50GB డేటాను ఎటువంటి రోజువారీ పరిమితులు లేకుండా అందిస్తుంది. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS మరియు అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బిఎస్ఎన్ఎల్ VS ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు
ప్రయోజనాల పరంగా చూసుకుంటే కనుక బిఎస్ఎన్ఎల్ టెల్కో నుండి లభించే 60 రోజుల చెల్లుబాటు ప్లాన్ జియో, Vi మరియు ఎయిర్టెల్ అందిస్తున్న దానికంటే చాలా మెరుగ్గా ఉంది. బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ ఆపరేటర్ల కంటే రెట్టింపు డేటాను తన వినియోగదారులకు అందిస్తుంది అది కూడా ఓటిటి చందాతో పాటు అదే ప్రయోజనాలతో ఉంటుంది. ప్రైవేట్ ఆపరేటర్ల విషయానికొస్తే వారి ప్లాన్ ల మధ్య తేడా లేదు. పాన్-ఇండియా 4G నెట్‌వర్క్‌ల విషయంలో మాత్రమే బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్లాన్ కు మరియు ప్రైవేట్ ఆపరేటర్ల ప్లాన్ లకు మధ్య ఉన్న ఏకైక తేడా. BSNL వినియోగదారులు ఈ అద్భుతమైన ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు అయితే ఏమైనప్పటికీ 4G వేగం పొందలేరు.


Click it and Unblock the Notifications








