Home
News

BSNL vs Vi: ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మెరుగ్గా ఉన్నది ఎవరు?

పోస్ట్‌పెయిడ్ యూజర్‌లలో చాలామంది లాంగ్ టర్మ్ వాలిడిటీ సభ్యత్వం కలిగిన ప్లాన్ ను ఎంచుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది ఉపయోగించే ఆటో-పే సర్వీస్ యొక్క సౌలభ్యమే దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు. అయితే మరికొందరికి ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఎక్కువ సంతృప్తిని అందించవు. అయితే వినియోగదారుల యొక్క అభిరుచులకు తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) అందిస్తున్న అత్యంత ఖరీదైన పోస్ట్ పెయిడ్ సమర్పణల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Vi యొక్క 4G నెట్‌వర్క్‌ సేవలు BSNL యొక్క నెట్‌వర్క్‌ సర్వీస్ కంటే మెరుగ్గా ఉన్నాయని మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసిఉంటుంది. అయితే ఇవి అందించే ఖరీదైన ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలలో మెరుగ్గా ఏది ఉందొ వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ రూ.1525 పోస్ట్ పెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.1525 పోస్ట్ పెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ టెల్కో రూ.1525 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో రూ.100 యాక్టివేషన్ చార్జీలు ఉంటాయి. ఈ ప్లాన్‌ను పొందడం కోసం నెలకు రూ.1,525 ఖర్చవుతుంది. ఎటువంటి FUP పరిమితులు లేకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు అపరిమిత డేటా వంటి ప్రయోజనాలతో వస్తుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. కుటుంబ కనెక్షన్ల కోసం BSNL ఎటువంటి అదనపు సిమ్ కార్డులను అందించదు. ఈ ప్లాన్‌తో అపరిమిత డేటాను అందింస్తున్నందున పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కోసం కంపెనీ అందించే అదనపు డేటా యాడ్-ఆన్ వోచర్‌ల అవసరం వినియోగదారులకు ఉండదు. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే ఇతర సంస్థల వలె కాకుండా BSNL ఈ ప్లాన్‌తో ఒక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని కూడా అందించదు.

వోడాఫోన్ ఐడియా REDX ప్లాన్

వోడాఫోన్ ఐడియా REDX ప్లాన్

వోడాఫోన్ ఐడియా తన REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను రూ.1,099 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు నిజమైన అపరిమిత FUP డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే యూజర్లు 100 SMS / రోజుకు బదులుగా మొత్తం చెల్లుబాటు కాలానికి 100 SMS ప్రయోజనాలను ఈ ప్లాన్‌తో పొందుతారు. ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ విఐపి మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్రయోజనాలకు ఒక సంవత్సరం పాటు అందిస్తుంది. ఇంకా వినియోగదారులు Vi మూవీస్ & టీవీ యాప్ లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్లలో వినియోగదారులకు ఉచిత ప్రవేశాన్ని కూడా అందిస్తుంది. వినియోగదారులు సంవత్సరానికి 7 రోజులు రూ.2,999 విలువైన అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ పొందటానికి కూడా అర్హులు అవుతారు.

BSNL vs Vi ఏ ప్లాన్ మంచిది?

BSNL vs Vi ఏ ప్లాన్ మంచిది?

వొడాఫోన్ ఐడియా యొక్క ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే మెరుగ్గా ఉండడమే కాకుండా తక్కువ ధరను కూడా కలిగి ఉంది. BSNL యొక్క ప్లాన్ లో OTT ప్రయోజనాలు ఏవీ లేవు అయితే Vi యొక్క ప్లాన్ వాటిలో టన్నుల కొద్దీ ప్రయోజనాలు ఉన్నాయి. Vi దాని వినియోగదారులకు అంతర్జాతీయంగా ప్రయాణించేటప్పుడు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే BSNL అటువంటి ప్రయోజనాన్ని అందించదు. చివరగా Vi యొక్క నెట్‌వర్క్ నాణ్యత BNSL కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇకపై 3G నెట్‌వర్క్‌లను ఇష్టపడని వ్యక్తి అయితే కనుక Vi యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవడమే ఉత్తమం. ఇతర విషయాలను పరిశీలిస్తున్నప్పుడు కూడా Vi యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్ BSNL యొక్క ప్లాన్ కంటే మెరుగ్గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL vs Vi: Who is Better on With Expensive Postpaid Plans?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X