డేటా వాడకంపై వినియోగదారులకు షాకిచ్చిన BSNL

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు భారీ షాకిచ్చింది.

|

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. టెలికాం రంగంలో ఇతర టెల్కోలతో బాగా యాక్టివ్ అవుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వినియోగదారులకు మింగుడుపడటం లేదు. ఇతర టెల్కోలకు ధీటుగా ప్లాన్లు ప్రవేశపెడుతూ ముందుకెళ్లాల్సింది పోయి ఉన్న ప్లాన్లలోని డేటాను పూర్తిగా తగ్గించివేస్తూ వస్తోంది. ప్రీపెయిడ్ , పోస్ట పెయిడ్ ప్లాన్ రివైజ్ డ్ చేస్తూ వస్తోంది.ఇందులో భాగంగా రూ.29 ప్లాన్ లో భారీ మార్పులను చేసింది.

 

ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపటం ఎలాగో చూడండి..!ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపటం ఎలాగో చూడండి..!

రూ.29లో ఇకపై వినియోగదారులు....

రూ.29లో ఇకపై వినియోగదారులు....

మారిన ప్లాన్ ప్రకారం రూ.29లో ఇకపై వినియోగదారులు 1 జిబి డేటాను మాత్రమే పొందుతారు. కాల్స్ లో ఎటువంటి పరిమితి లేకుండా వారం రోజుల పాటు లోకల్ ,నేషనల్ అన్ లిమిటెడ్ కాలింగ్స్ ని చేసుకోవచ్చు. దీంతో పాటు 7 రోజులు పాటు 300 ఎస్సెమ్మెస్ లు పొందుతారు. అయితే ఈ ప్లాన్ కేవలం ఢిల్లీ, ముంబై సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుందని BSNL తెలిపింది.

ఈ ప్లాన్ రివిజన్ చేయకముందు...

ఈ ప్లాన్ రివిజన్ చేయకముందు...

అయితే ఈ ప్లాన్ రివిజన్ చేయకముందు వినియోగదారులు 2 జిబి డేటాను పొందేవారు. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ ల చొప్పున వారం రోజులు పాటు ప్రయోజనాలు అందేవి. అలాగే లోకల్ నేషనల్, రోమింగ్ అన్ లిమిటెడ్ గా ఉండేవి. ఇప్పుడు ఈ ప్లాన్ లో ప్రయోజనాలను మరింతగా పెంచాల్సింది పోయి తగ్గించమేంటని పలువురు వినియోగదారులు వాపోతున్నారు.

 

 

ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ.52కి పోటీగా ఉంది....
 

ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ.52కి పోటీగా ఉంది....

కాగా ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ.52కి పోటీగా ఉంది. ముకేష్ అంబానీ రిలయన్స్ జియో రూ.2 52 ప్లాన్ లో 70 ఎసెమ్మెస్ లు, 1.05 జిబి డేటా వస్తుంది. ఈ డేటాను రోజుకు 150 ఎంబి చొప్పున వారం రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. కాలింగ్ సదుపాయాలు అపరిమితం. బిఎస్ఎన్ఎల్ లాగే ఈ ప్లాన్ కూడా వారం రోజుల వ్యాలిడిటీతో వచ్చింది.

బిఎస్ఎన్ఎల్ మెగా ప్లాన్ పేరుతో....

బిఎస్ఎన్ఎల్ మెగా ప్లాన్ పేరుతో....

కాగా లేటెస్ట్ గా బిఎస్ఎన్ఎల్ మెగా ప్లాన్ పేరుతో కొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో భాగంగా రూ.100తో రీఛార్జ్ చేసుకుంటే రూ.399 స్పెషల్ ఓచర్ వస్తుందని బిఎస్ఎన్ఎల్ సీఎండి అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. అయితే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ద్వారా ఇతర నెట్వర్కుల నుండి, BSNL నెట్వర్క్లోకి విచ్చేసిన నూతన వినియోగదారులు, మరియు నేరుగా BSNL సిం కార్డ్ తీసుకుంటున్న వినియోగదారుల కోసం మెగా ఆఫర్ ప్రారంభించబడింది. అనగా పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు. మరియు ఈ ఆఫర్ కేవలం IOCL మరియు HPCL వినియోగదారులకు మాత్రమే.

 

 

వినియోగదారులు వారి LPG బిల్లులలో...

వినియోగదారులు వారి LPG బిల్లులలో...

ఈ వినియోగదారులు వారి LPG బిల్లులలో ముద్రించిన కూపన్ ద్వారా, STV 399 ప్లాన్ ఆఫర్ను, 100 రూపాయలకే పొందగలరు. కానీ, ఈ కూపన్ ప్రస్తుతం కేవలం ఏడు రాష్ట్రాలలో మాత్రమే లభిస్తుంది - అవి వరుసగా, ఉత్తరప్రదేశ్ (ఈస్ట్ & వెస్ట్), ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ మరియు జమ్ము & కాశ్మీర్. విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఆఫర్ అందించే అవకాశాలు లేకపోలేదు.

 

 

BSNL ఆఫీసుల్లో ఉచిత బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు....

BSNL ఆఫీసుల్లో ఉచిత బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు....

అర్హులైన వినియోగదారులందరూ భాగస్వామ్య దుకాణాల్లో, మరియు BSNL ఆఫీసుల్లో ఉచిత బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు. మరియు కేవలం 100 రూపాయలు చెల్లించి, 399 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఈ బిఎస్ఎన్ఎల్ STV 399 రూపాయల ప్లాన్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించబడింది. దీని ప్రయోజనాలను గమనిస్తే, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS మెసేజులు, రోజుకు 1 జిబి ఇంటర్నెట్ డేటా చొప్పున 74 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంతేకాకుండా, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (PRBT) ఫీచర్ కలిగి, ఏ పాటనైనా 74 రోజులలో ఎప్పుడైనా మార్చుకోగలిగేలా ఆఫర్ ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ రోమింగ్లో ఢిల్లీ మరియు ముంబై పరిధులలో కూడా ఈ కొత్త ఆఫర్ వర్తించబడుతుంది.

Best Mobiles in India

English summary
BSNL will now give you 50% less data under this plan more News at Gizot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X