Home
News

నెట్‌వర్క్ సమస్య లేకుండా అపరిమిత కాల్స్ కోసం BSNL Wings సర్వీస్...

ప్రభుత్వ-టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన వినియోగదారుల కోసం స్వంత ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ 'బిఎస్ఎన్ఎల్ వింగ్స్' ను అందిస్తున్నది. ఈ వింగ్స్ సర్వీసులో భాగంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఆడియో కాలింగ్‌తో పాటుగా వీడియో కాల్స్ మరియు ఇన్‌స్టంట్ మెసేజ్ చేయడానికి కూడా బిఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ యూజర్లను అనుమతిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ వింగ్స్ సర్వీస్

మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ లేని ప్రాంతాల్లో ఫోన్ కాల్స్ చేయడానికి BSNL యొక్క ఈ వింగ్స్ సర్వీస్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే మీకు Wi-Fi కనెక్షన్ మాత్రం అందిబాటులో ఉండవలసి ఉంటుంది. ఇందులో ఉత్తమమైన విషయం ఏమిటంటే BSNL వింగ్స్ ఏదైనా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) నుండి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుతో పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ వింగ్స్ సర్వీస్

బిఎస్ఎన్ఎల్ వింగ్స్ సర్వీస్

BSNL వింగ్స్ అనేది ఇంటర్నెట్ టెలిఫోనీ లేదా VoIP సర్వీస్ కావున దీని ద్వారా వినియోగదారులు ఆడియో, వీడియో, కాన్ఫరెన్స్ లను సులభంగా ఎటువంటి ఆటంకం లేకుండా చేయవచ్చు. భారతదేశంలో కస్టమర్లు తరచుగా నెట్‌వర్క్ కవరేజ్ గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు కావున బిఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ సర్వీసుతో ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దేశంలోని ఏ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌తోనైనా బిఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ ను ఉపయోగించవచ్చు. వింగ్స్ సేవను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కాల్‌లు చేయడానికి మరియు స్వీకరించడానికి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు.

అంతర్జాతీయ రోమింగ్ సౌకర్యం

బిఎస్ఎన్ఎల్ వింగ్స్ సర్వీసులో అంతర్జాతీయ రోమింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత వింగ్స్ యూజర్లు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఎటువంటి ఖర్చు లేకుండా కాల్స్ అందుకోవచ్చు. ఈ సర్వీసును సెటప్ చేయడానికి వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో ‘బీఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ల్యాప్‌టాప్ వినియోగదారులు SIP క్లయింట్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్‌కు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేకపోతే ఇంటర్నెట్ లీజ్డ్ లైన్ ద్వారా వినియోగదారులకు వింగ్స్ సేవను పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ వింగ్స్ సర్వీసుతో దేశీయ రోమింగ్ను ఉచితంగా అందిస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ రూ.1,099 వార్షిక ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ రూ.1,099 వార్షిక ప్లాన్

బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ తన వింగ్స్ సర్వీసులో భాగంగా కేవలం రూ.1,099 ధర వద్ద వార్షిక ప్లాన్ ను అందిస్తోంది. కొన్ని ప్రత్యేక సర్వీసులు మరియు IN కాల్స్ మినహా వినియోగదారులకు నెలకు 1800 నిమిషాల వినియోగం (MOU) (ఆన్‌లైన్ / ఆఫ్‌నెట్) కోసం ఉచిత కాల్స్ చేయడానికి వినియోగదారులు అనుమతించబడతారు. ఈ పరిమితికి మించి భారతదేశంలోని అన్ని కాల్‌లకు నిమిషానికి 30 పైసలు వసూలు చేయబడతాయి. అలాగే ఇతర దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ కాల్స్ నిమిషానికి రూ.1.50 పైసలు వసూలు చేయబడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Wings Service Offers Unlimited Internet Voice and Video Calling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X