Home
News

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.1999 కే ప్రతినెలా 1300GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. 6 నెలల వ్యాలిడిటీ..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన ఇంటర్నెట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వింటర్‌ బోనంజా (BSNL Winter Bonanza 2024) పేరుతో సూపర్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి నెలా 1300GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ డిల్లీ, ముంబై ప్రాంతాల్లో అందుబాటులో లేదని తెలిపింది. ఈ ఆఫర్‌ సమయంలో ల్యాండ్‌లైన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. BSNL భారత్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకున్నవారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

25Mbps వేగంతో 1300GB డేటా : BSNL వింటర్ బోనంజా ఆఫర్‌లో భాగంగా భారత్ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ (BSNL Bharat Fibre Broadband) యూజర్లు రూ.1999 ప్లాన్‌ ద్వారా ఏకంగా 6 నెలలపాటు ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ప్రతినెల 25Mbps వేగంతో 1300GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం 4Mbps వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు.

BSNL Winter Bonanza 2024 Offer

అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ : ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ సమయంలో ల్యాండ్‌ లైన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. దీపావళి సమయంలోనూ BSNL తన బేసిక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌పై ధరను తగ్గించింది. అయితే ఈ కొత్త ఆఫర్‌ ద్వారా మరింత మంది యూజర్లు BSNL వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పటికే BSNL గత మూడు నాలుగు నెలలుగా లక్షలాది మొబైల్‌ కనెక్షన్‌లను ఆకర్షించింది.

వింటర్‌ బోనంజా 2024 : మొబైల్‌ కనెక్షన్‌ల విషయంలో నాలుగో స్థానానికి పరిమితం అయిన BSNL.. బ్రాడ్‌బ్యాండ్ అంశంలో మాత్రం ప్రైవేటు సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. అధికంగా ఇంటర్నెట్‌ను వినియోగించే వారికి వింటర్‌ బోనంజా రూ.1999 ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. 1300GB డేటాతో ఎటువంటి ఆందోళన లేకుండా బ్రౌజింగ్‌, డౌన్‌లోడ్స్‌, స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు.

ఇతర ప్లాన్‌లు : భారత్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ బేసిక్‌ ప్లాన్‌ ధర రూ.499 గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 60Mbps వేగంతో 3300GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.299, రూ.399 ప్లాన్‌ను అందుబాటులో ఉన్నాయి. ప్లాన్‌ల ధరలతోపాటు అదనంగా GST ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

BSNL ప్రస్తుతం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయితే మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని మాత్రం తక్కువ ధరకే అందిస్తోంది. అయితే బ్రాడ్‌బ్యాండ్‌లో నాణ్యమైన సేవల్ని అందిస్తోంది. త్వరలో ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీల భారం కూడా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొబైల్‌ కనెక్షన్ల విషయంలో ప్రైవేటు సంస్థలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది.

BSNL ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లక్ష టవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ నాటికి 50 వేలకు పైగా టవర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 41 వేలకు పైగా టవర్లు కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Winter Bonanza 2024 Offer 1300GB data every month upto 6 months of validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X