Home
News

రూ.200లోపే అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌.. BSNL బంపరాఫర్లు మిస్ అవ్వకండి..

By Ram Kumar

ఈ రోజుల్లో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేటు కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL, తన వినియోగదారుల కోసం ఎన్నో రకాల చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తూ ఆకట్టుకుంటోంది.

రూ.200లోపే వివిధ రకాల ప్లాన్లు తీసుకురావడంతో వినియోగదారులు తమ కమ్యూనికేషన్ అవసరాలను చాలా ఈజీగా తీర్చుకోవచ్చు. ఒక్కొక్కరి అవసరానికి తగ్గట్టుగా ఈ ప్లాన్స్‌లో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా మరి..

BSNL s Best Prepaid Plans Under Rs 200 for Voice and Data

రూ.107 ప్లాన్

ఇదిగో మీకోసం బేసిక్ ప్లాన్. కేవలం కాలింగ్ కోసమే చూస్తున్నావారైతే ఈ ప్లాన్ మీ కోసమే. ఇందులో మీరు దేశమంతటా లోకల్, STD కాల్స్ చేసుకోవడానికి 200 నిమిషాల ఉచిత టాక్ టైమ్ లభిస్తుంది. డేటా, SMS మాత్రం ఉండవు. ఈ ప్లాన్ 35 రోజుల పాటు పనిచేస్తుంది. ఎక్కువగా ఫోన్ మాట్లాడేవారికి, డేటా అవసరం లేనివారికి ఇది బెస్ట్ ఆప్షన్.

రూ.153 ప్లాన్

అన్‌లిమిటెడ్ కాలింగ్ కావాలా? రోజూ డేటా కూడా వాడుకుంటారా? అయితే ఈ ప్లాన్ మీకు బాగా సరిపోతుంది. దీనిలో మీరు దేశమంతటా ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ముంబై, ఢిల్లీలలో MTNL నెట్‌వర్క్‌పై కూడా రోమింగ్ ఉచితం. అంతేకాదు, రోజుకు 1GB డేటా కూడా వస్తుంది. ఒకవేళ ఆ డేటా అయిపోతే, స్పీడ్ కాస్త తగ్గి 40 Kbpsకి చేరుతుంది. రోజుకు 100 SMSలు కూడా ఫ్రీ, ఈ ప్లాన్ 28 రోజులు వ్యాలిడిటీ తో వస్తుంది.

రూ.199 ప్లాన్

డేటా ఎక్కువగా కావాలా.. ఐతే ఈ ప్లాన్ మీ కోసమే. పై ప్లాన్‌లోని అన్ని ప్రయోజనాలతో పాటు, ఇందులో రోజుకు 2GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా అయిపోతే, స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది. కాలింగ్ అన్‌లిమిటెడ్, SMSలు రోజుకు 100 వరకు ఉచితం. ఈ ప్లాన్ 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఎక్కువ డేటా వాడేవారికి, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

రూ.197 ప్లాన్

తక్కువ ధరలో ఎక్కువ రోజులు ప్లాన్ ఉండాలనుకుంటున్నారా? ఈ ప్లాన్ మొదటి 15 రోజులు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా (తర్వాత స్పీడ్ తగ్గుతుంది), రోజుకు 100 SMSలు ఇవన్నీ మొదటి 15 రోజులు మాత్రమే. కానీ, ఈ ప్లాన్ ఏకంగా 70 రోజుల వరకు పనిచేస్తుంది. మొదట్లో ఎక్కువ ప్రయోజనాలు కావాలనుకునేవారికి, ఎక్కువ కాలం పాటు ప్లాన్ వాలిడిటీ కోరుకునేవారికి ఇది సరైనది.

రూ.147 ప్లాన్

మొత్తం నెల రోజులకు కలిపి ఒకేసారి డేటా కావాలా? ఈ ప్లాన్ మీకు నచ్చుతుంది. ఇందులో మీరు నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, మొత్తం 10GB డేటాను ఇస్తారు. ఈ డేటాను మీరు నెలలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక SMSల గురించి చింతే లేదు, నెలంతా అన్‌లిమిటెడ్ SMSలు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజులు పనిచేస్తుంది.

చూశారుగా, BSNL రూ.200 లోపే ఎన్నో రకాల ప్లాన్స్‌ను అందిస్తోంది. మీ అవసరానికి తగ్గట్టుగా ఏ ప్లాన్ కావాలో ఎంచుకోండి, హ్యాపీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL offers affordable prepaid plans under Rs 200 catering to various needs like calling and data. Plans range from Rs 107 to Rs 199 with diverse benefits, allowing users to choose based on their requirements.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X