Home
News

అట్లుంటది BSNLతో.. జియో, ఎయిర్‌టెల్ అల్లాడిపోవాల్సిందే.. రోజుకు రూ.5లతో ఏడాదికి 600GB డేటా!!

By Ram Kumar

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశవ్యాప్తంగా తమ 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తూనే, వినియోగదారుల కోసం అదిరిపోయే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తోంది. ప్రైవేట్ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే, BSNL రీఛార్జ్ ప్లాన్లు చాలా తక్కువ ధరలో లభిస్తుండటంతో, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటున్నాయి.

BSNL అందిస్తున్న ప్లాన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూ. 1999 ప్లాన్ గురించే. ఇది నిజంగానే పైసా వసూల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. 365 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ తీసుకుంటే, ఏడాదిపాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు.

BSNL s Mega Offer  600GB Data  1-Year Validity for Just    1999

నిజానికి గత కొద్ది నెలలుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచడంతో చాలామంది వినియోగదారులు BSNL వైపు చూస్తున్నారు. తక్కువ ధరకే మంచి సేవలు అందిస్తుండటంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య రాకెట్ వేగంతో పెరుగుతోంది.

* BSNL రూ.1999 ప్లాన్ బెనిఫిట్స్

ఈ చౌక ప్లాన్‌లో బోలెడు లాభాలున్నాయి. కేవలం రూ.1999 చెల్లిస్తే చాలు, ఏడాది పొడవునా కింద బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

అన్‌లిమిటెడ్ కాలింగ్: ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేసుకోవచ్చు, ఎంతైనా మాట్లాడుకోండి, ఏ లిమిట్ లేదు, అది కూడా ఏడాది పొడవునా ఫ్రీ.

600GB డేటా: సంవత్సరం మొత్తం వాడుకునేందుకు ఏకంగా 600GB డేటా ఇస్తోంది. అంటే కావాల్సినప్పుడు డేటా వాడుకునే వెసులుబాటు ఉంటుంది.

రోజుకి 100 ఉచిత SMS: రోజుకి 100 చొప్పున ఉచితంగా SMSలు పంపించుకోవచ్చు.

డేటా ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నా, సోషల్ మీడియాలో గడుపుతున్నా.. ఈ ప్లాన్‌లో డేటాకు ఢోకా ఉండదు.

ఇంకా చెప్పాలంటే, BSNL కస్టమర్లకు ఎక్స్‌ట్రాగా 30 రోజుల పాటు కొన్ని ప్రత్యేక సర్వీసులను ఉచితంగా అందిస్తోంది. కాబట్టి తక్కువ ఖర్చులో అన్ని ముఖ్యమైన ఫీచర్లు కావాలనుకునేవారికి ఈ ప్లాన్ ఒక సూపర్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

* ఎయిర్‌టెల్ రూ.1999 ప్లాన్‌

BSNL రూ.1999 ప్లాన్‌లో 600GB డేటా ఇస్తుంటే, అదే ధరకు ఎయిర్‌టెల్ కేవలం 24GB డేటా మాత్రమే ఇస్తోంది. అంటే నెలకి జస్ట్ 2GB హై-స్పీడ్ డేటా మాత్రమే. అయితే ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 ఉచిత SMSలు మాత్రం ఉంటాయి.

అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ద్వారా కొన్ని ఉచిత టీవీ షోలు, సినిమాలు, లైవ్ ఛానెల్స్‌ని చూడొచ్చు. కానీ, ఇందులో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఉండదు.

* BSNL దూకుడుకు కారణమిదే

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలు పెంచడంతో BSNL ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చాలామంది కస్టమర్లు తమ నంబర్లను BSNLకు పోర్ట్ చేసుకుంటున్నారు. కారణం ఒక్కటే.. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు BSNL అందిస్తుండటమే.

* కొత్త ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్

ఇదిలా ఉంటే జనవరి 17న ప్రభుత్వం సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. అదే "ఇంట్రా సర్కిల్ రోమింగ్" (ICR). దీనివల్ల జియో, BSNL, ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ సిమ్ పనిచేయకపోయినా, అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా వాడుకొని కాల్స్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసిన సింగిల్ టవర్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఈ టవర్ అనేక టెలికాం ఆపరేటర్ల 4G సేవలను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎక్కువ టవర్లు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఖర్చు తగ్గుతుంది, మౌలిక సదుపాయాలు మరింత సమర్థవంతంగా ఉపయోగపడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL shocks Jio, Airtel with an affordable 4G plan offering unlimited calls, 600GB data, and 100 daily SMS for a year at ₹1999. BSNL's popularity is rising due to private companies' price hikes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X