BSNL మరో కొత్త ప్లాన్, 50Mbps స్పీడుతో 500GB ఉచిత డేటా

దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఆ మార్పులు బ్రాడ్ బ్యాండ్ వైపుకు వెళ్లడం శరవేగంగా జరిగిపోతోంది.

|

దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఆ మార్పులు బ్రాడ్ బ్యాండ్ వైపుకు వెళ్లడం శరవేగంగా జరిగిపోతోంది. అన్ని టెల్కోలు ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ వైపు తమ దృష్టిని నిలుపుతున్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియోకు అతి త్వరలోనే తన బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించేందుకు రెడీ అయింది. అంతకన్నా ముందుగానే దిగ్గజాలు సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ఆఫర్లతో వినియోగదారులు తమ పరిధి నుండి చేజారిపోకుండా కాపాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే బీఎస్‌ఎన్‌ఎల్ ఆకట్టుకునే ప్లాన్లను ప్రవేశపెడుతూ నూతన కస్టమర్లను ఆకర్షించడమే కాదు, ఉన్న కస్టమర్లను పోకుండా చూసుకుంటున్నది. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ నూతనంగా పలు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను బాగానే ప్రవేశపెట్టింది.

సంచలనం రేపుతున్న Vivo X21, ఆ ఫీచరే హైలెట్సంచలనం రేపుతున్న Vivo X21, ఆ ఫీచరే హైలెట్

రూ.777 కే..

రూ.777 కే..

తాజాగా రూ.777 కే మరో నూతన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఎఫ్‌టీటీహెచ్ (ఫైబర్ టు ది హోమ్) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వాడేవారి కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

 500 జీబీ డేటా ఉచితం

500 జీబీ డేటా ఉచితం

రూ.777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు 500 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. 500 జీబీ ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 50 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది.

రూ.1277

రూ.1277

అలాగే రూ.1277 కు మరో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 30 రోజులకు గాను 750 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. దీంట్లో ఉచిత డేటా అయిపోగానే స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి 2 ఎంపీబీఎస్ కు పడిపోతుంది. ఈ రెండు ప్లాన్లు ఫైబ్రో కాంబో యూఎల్‌డీ పేరిట లభిస్తున్నాయి.

రూ. 99, రూ. 199, రూ. 299, రూ.399 ప్లాన్లను

రూ. 99, రూ. 199, రూ. 299, రూ.399 ప్లాన్లను

ఈ మధ్య కొత్తగా రూ. 99, రూ. 199, రూ. 299, రూ.399 ప్లాన్లను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
99 రూపాయల ప్లాన్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తంగా 45 జీబీ డేటాను అందిస్తోంది. దీని రోజువారీ పరిమితి 1.5జీబీ.
అదేవిధంగా 199 రూపాయల 150 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 5 జీబీ డేటా.
299 రూపాయల 300 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 10 జీబీ డేటా.
399 రూపాయల 600 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 20 జీబీ డేటా.

 అపరిమిత వాయిస్‌ కాలింగ్‌

అపరిమిత వాయిస్‌ కాలింగ్‌

ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు. 45 జీబీ నుంచి 600 జీబీ వరకు డేటాను ఆఫర్‌ చేయనున్నామని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ల డౌన్‌లోడ్‌ స్పీడు 20 ఎంబీపీఎస్‌. ఒక్కసారి రోజువారీ పరిమితి అయిపోతే, ఈ స్పీడు 1ఎంబీపీఎస్‌కు దిగి వస్తుందని టెలికాంటాక్‌ రిపోర్టు చేసింది.

ఉచిత ఈ-మెయిల్‌ ఐడీ

ఉచిత ఈ-మెయిల్‌ ఐడీ

ఈ ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత ఈ-మెయిల్‌ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌ను అందిస్తోంది. తొలుత 90 రోజుల వాలిట్‌తో ప్రమోషనల్‌ బేసిస్‌లో వీటిని లాంచ్‌చేసింది. డిమాండ్‌ బట్టి ఒకవేళ ఈ ప్లాన్ల తుదిగడువును పెంచాల్సి వస్తే పెంచుతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

కొత్త యూజర్లకు మాత్రమే..

కొత్త యూజర్లకు మాత్రమే..

పాత యూజర్లు ఈ ప్లాన్లలోకి తరలి రాలేరని, కేవలం కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ​ ప్లాన్లను కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌ చేయాలి. ఆరు నెలల అనంతరం ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలోకి యూజర్లు వెళ్లిపోవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL's Rs 777 broadband plan offers 500GB data at 50Mbps speed More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X