Home
News

BSNL అదిరిపోయే ఆఫర్.. రోజుకి రూ.5ల కన్నా తక్కువ ఖర్చుతో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

BSNL ఇప్పుడు దేశమంతా తన 4G నెట్‌వర్క్‌ని శరవేగంతగా విస్తరిస్తోంది. జూన్-జులై నాటికి ఏకంగా లక్ష కొత్త మొబైల్ టవర్లు పెట్టాలని టార్గెట్ పెట్టుకుంది. ఆల్రెడీ 65 వేల టవర్ల పనులు పూర్తయ్యాయి కూడా. ఈ దూకుడుతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సిద్ధమైంది. అంతేకాదు, భవిష్యత్తులో మరింత అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ కోసం 5G సర్వీసులను కూడా టెస్ట్ చేస్తోందీ ప్రభుత్వ టెలికాం సంస్థ.

BSNL దగ్గర లాంగ్ వ్యాలిడిటీ, తక్కువ ధరలో చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో సూపర్‌హిట్ ప్లాన్ ఏదంటే.. రూ.897 ప్లాన్. ఇది కేవలం రోజుకి రూ.5ల కన్నా తక్కువ ఖర్చుతో 180 రోజుల పాటు అదిరిపోయే బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ ప్లాన్‌లో ఇండియా మొత్తం అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ చేసుకోవచ్చు, ఎక్కడినుంచైనా కాల్ అందుకోవచ్చు.

BSNL s Super Hit Plan  Get Unlimited Benefits for Just Rs 5 a Day

* 100 ఫ్రీ SMSలు

ఢిల్లీ, ముంబై (MTNL నెట్‌వర్క్) రోమింగ్‌లో కూడా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఫ్రీ SMSలు ఏ నెట్‌వర్క్‌కైనా పంపుకోవచ్చు. డేటా విషయానికొస్తే.. ఏకంగా 90GB హై-స్పీడ్ డేటా. రోజుకి ఇంత లిమిట్ అని లేదు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. 90GB అయిపోయాక స్పీడ్ కాస్త తగ్గుతుంది, 40kbps స్పీడ్‌తో బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

* BiTV ఫ్రీ

ఇంకో స్పెషల్ ఏంటంటే, BSNL తన యూజర్లందరికీ BiTV ఫ్రీగా ఇస్తోంది. ఇందులో 450కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ చూడొచ్చు, అదనంగా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. కొన్ని OTT యాప్స్ కూడా ఈ ప్లాన్‌లో కలిపే ఉన్నాయి. BSNLలో ఇంకా చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి.

రూ.897 ప్లాన్ కాకుండా, TRAI రూల్స్ ప్రకారం కొత్త అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్స్ కూడా BSNL తీసుకొచ్చింది. ఎవరికైతే డేటా అవసరం లేదు, కేవలం కాలింగ్ చేసుకుంటే చాలు అనుకుంటారో వాళ్ల కోసం ఈ ప్లాన్స్. వీటిలో తక్కువ ధర ప్లాన్ కేవలం రూ.99 నుంచే స్టార్ట్ అవుతుంది.

ఇంకో పాపులర్ ప్లాన్ Plan-997. ఇందులో మీకు అన్‌లిమిటెడ్ కాల్స్ (లోకల్, STD, నేషనల్ రోమింగ్, ముంబై, ఢిల్లీ కూడా కవర్ అవుతాయి). రోజుకి 2GB హై-స్పీడ్ డేటా (లిమిట్ దాటితే 40kbps స్పీడ్), ప్రతిరోజు 100 ఫ్రీ SMS లు, ఇంకా 160 రోజుల వ్యాలిడిటీ కూడా ఉంది.

ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్‌తో BSNL ఎప్పటిలాగే తక్కువ ధరలో టెలికాం సేవలు అందిస్తూనే ఉంది. లాంగ్ టర్మ్ కోసం తక్కువ ఖర్చులో మంచి ప్లాన్ కావాలనుకునే వాళ్లకి BSNL బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు. ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో చూసుకుంటే, వొడాఫోన్ ఐడియా (Vi) మాత్రమే ఇలాంటి 180 రోజుల ప్లాన్ ఇస్తోంది.

మిగతా పెద్ద కంపెనీల దగ్గర ఈ ఆప్షన్ లేదు. ఎయిర్‌టెల్, జియో సంస్థలు 6 నెలల ప్లాన్లకు రూ.వేలలోనే డబ్బులు వసూలు చేస్తున్నాయి. BSNL సిగ్నల్ బాగా ఉన్నచోట నివసించేవారికి రూ.897 ప్లాన్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. దీంతో రీఛార్జ్ చేసుకుంటే 6 నెలల వరకు రీఛార్జ్ చేసుకోవాలనే టెన్షన్ ఉండదు.

Best Mobiles in India

English summary
BSNL expands 4G, tests 5G, offers budget-friendly prepaid plans like Rs 897 with unlimited calls, data, and 180-day validity, competing with private telecoms.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X