బడ్జెట్ 2013: మొబైల్ ఫోన్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం

రైల్వే బడ్జెట్ 2013: ఐఆర్‌సీటీసీ పునరుద్ధరణ ఇంకా ఉచిత వై-ఫై పై మంత్రి హామి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మంగళవారం మధ్యాహ్నం 2013-14 సంవత్సారానికిగాను రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో భాగంగా ఈ-టికెటింగ్ సిర్వీస్‌ను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. రైల్వే ఆన్‌లైన్ బుకింగ్‌కు తోడ్పడుతున్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరిచే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి స్ఫష్టం చేసారు. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి ఈ-టికెటింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు బన్సల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
సరికొత్త ఈ-టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావటం వల్ల ఐఆర్‌సీటీసీ ద్వారా నిమిషానికి 7,200టికెట్‌లను పొందవచ్చని అన్నారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ పనితీరును పరిశీలించినట్లయితే నిమిషానికి కేవలం 2,000 టికెట్‌లను మాత్రమే అందించగలగుతుంది. అదేవిధంగా రాబోయే ఈ - టికెటింగ్ వ్యవస్థ, ఐఆర్‌సీటీసి వెబ్‌సైట్‌ను ఏకకాలంలో లక్షమందిని సపోర్ట్ చేసేవిధంగా తీర్చిదిద్దుతుందని బన్సల్ అన్నారు.


Click it and Unblock the Notifications








