Budget 2024 కేంద్ర బడ్జెట్ 2024లో ఫోన్‌ల ధరల తగ్గింపుపై ప్రకటన ఉంటుందా..?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ల ధర తగ్గింపుపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. దీనిపై ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాల్సి ఉంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 7 వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
గత సంవత్సరం కెమెరా లెన్స్ సహా ఇతర విడిభాగాలపై దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించింది. అయితే తాజాగా వచ్చిన రిపోర్టు ఆధారంగా లిథియం అయాన్ బ్యాటరీలు ట్యాక్స్‌లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు తయారీ చేసే సంస్థలకు ఇది మేలు చేస్తుందని భావిస్తున్నారు.

కొన్ని నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని తిరిగి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా భారత్‌లో తమ ఉత్పత్తులను తయారీ చేసే సంస్థలను ఇది ప్రోత్సహిస్తుందని తెలుస్తోంది.
దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారైన వస్తువుల పోటీతత్వాన్ని పెంచడం, పెద్ద ఎత్తున తయారీని ప్రోత్సహించడం మరియు అనేక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. దీని ద్వారా ఉత్పత్తి పెరగడం సహా ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడతాయని తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ మరియు ఇతర 14 కీలక రంగాలకు ఈ పథకాన్ని అమలు చేసిన తర్వాత అదనపు రంగాలను ఈ పథకంలో చేర్చేందుకు ప్రణాళిక రచిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులో ఉన్న సవాళ్లను గుర్తించడం సహా కొత్త అవకాశాలను సృష్టించడం మరిన్ని కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో 78.5 లక్షల ఉద్యోగాల కల్పన అవసరమని సర్వే తెలిపింది. దీంతోపాటు వివిధ రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అనిశ్చితి నెలకొందని ఆర్థిక సర్వే తెలిపింది.
టెక్నాలజీ కారణంగా పని విధానాల్లో అనేక మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని, మరియు కొన్ని రంగాల్లో ఆటోమేషన్ రానుందని తెలిపింది. దీంతోపాటు అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








