Budget 2024 కమ్యూనికేషన్ల రంగానికి రూ.1.37 లక్షల కోట్ల కేటాయింపు.. డీప్‌టెక్ బలోపేతానికి కొత్త టెక్నాలజీ!!
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను (Budget 2024) పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సుమారు గంటపాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. సుమారు రూ.48 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టినా ప్రాధాన్య రంగాలకు మినహా ఎక్కడా అధికంగా కేటాయింపులు చేయలేదు.
అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందుడుగు వేస్తోందని వెల్లడించారు. టెక్నాలజీ రంగం అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామంటూనే రక్షణ అవసరాల కోసం డీప్‌టెక్‌ను బలోపేతం చేసేందుకు కొత్త టెక్నాలజీని త్వరలో ప్రారంభిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

మధ్యంతర బడ్జెట్ 2024లో కమ్యూనికేషన్ల రంగానికి రూ.1.37 లక్షల కోట్లను కేటాయించారు. దీంతోపాటు సెమీకండక్టర్స్, డిస్‌ప్లే ఎకో సిస్టమ్ తయారీకి రూ.6903 కేటాయించారు. అలాగే సోలార్ విద్యుత్ గ్రిడ్ కోసం రూ.8500 కోట్లు కేటాయించారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.
ఈ పథకంలో భాగంగా ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేసుకున్న వారికి సంవత్సరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నగదు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్ అమలుచేయనుంది. సంవత్సర కాలంలోనే కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటుచేయనున్నారు.

అలాగే దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు 'లఖ్ పతి దీదీ' పథకం కింద నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఎల్‌ఈడీ బల్బుల తయారీ, డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు, ప్లింబింగ్ వంటి పనులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్వయం సహాయక సంఘాల సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
* బడ్జెట్‌కు రెండు రోజుల ముందు మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ కవర్లు, కెమెరా లెన్స్, బ్యాక్ కవర్, GSM యాంటెన్నా సహా ఫ్లోన్లు తయారీ చేసే ప్లాస్టిక్, మెటల్ దిగుమతి సుంకాలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత్ గట్టి పోటీనిస్తుందని ICEA ( ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్) అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ నిర్ణయంతో దేశంలో మరిన్ని ఫోన్ల తయారీ ప్లాంట్లు ఏర్పాటు కానున్నయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 5G స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. భారీ స్థాయిలో మేడిన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
వచ్చే రెండు సంవత్సరాల్లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరుగుతాయని ICEA పేర్కొంది. ఫలితంగా 39 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్‌లను తయారవుతాయని అంచనా వేసింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications