Budget 2024 కేంద్ర బడ్జెట్‌లో టెక్నాలజీ రంగానికి ప్రాధాన్యత దక్కనుందా.. ఈ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయా?
కేంద్ర ప్రభుత్వం జులై 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రేపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ 2024 పై (Budget 2024) అనేక రంగాల్లో భారీ అంచనాలున్నాయి. వీరితోపాటు టెక్నాలజీ రంగం కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ 2024 లో ల్యాప్‌టాప్, మొబైల్ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితోపాటు LED టీవీలు, కెమెరా లెన్స్‌లపై కస్టమ్స్ డ్యూటీ లు తగ్గే అవకాశం ఉంది. ఇలా టెక్నాలజీ రంగంలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఎలా ఉండే అవకాశం ఉంది. టెక్నాలజీ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది.

కేంద్ర బడ్జెట్ 2024 లో మొబైల్, ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ టీవీలు, కెమెరా లెన్స్‌ల టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇయర్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌ల ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. అయితే ఇది వినియోగదారులకు కొంచెం నిరాశను కలిగించే అవకాశం ఉంది.
కేంద్ర బడ్జెట్‌పై ఫిన్‌టెక్, రిటైల్, ఈ-కామర్స్, ఫార్మా, తయారీ, లాజిస్టిక్స్, టెలికాం వంటి అనేక రంగాల్లో ఆవిష్కరణలు సహా అభివృద్ధి, డిజిటలైజేషన్ వంటి అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. సైబర్ సెక్యురిటీ, డిజిటల్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో భారత్ ఐటీ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడం పైనా దృష్టిసారించాలి.
2023-24 బడ్జెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు రూ.16361 కోట్లు కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కొత్త కేంద్రాల ఏర్పాటు చేయడం సహా అనేక ప్రాజెక్టుల కేసం ప్రత్యేక కేటాయింపులు చేసింది. అయితే ఈ సంవత్సరం బడ్జెట్‌లోనూ ఈ శాఖకు ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో 78.5 లక్షల ఉద్యోగాల కల్పన అవసరమని సర్వే తెలిపింది. దీంతోపాటు వివిధ రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అనిశ్చితి నెలకొందని ఆర్థిక సర్వే తెలిపింది.
టెక్నాలజీ కారణంగా పని విధానాల్లో అనేక మార్పులు చోటుచేసుకొనే అవకాశాలు ఉన్నాయని, మరియు కొన్ని రంగాల్లో ఆటోమేషన్ రానుందని తెలిపింది. దీంతోపాటు అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) వినియోగం పెరుగుతుందని ఆర్థిక సర్వే - 2024 పేర్కొంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








