అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ 2020 సేల్ లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్స్

|

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లు రెండు ఇప్పుడు 2020 సంవత్సరంలో తమ మొదటి సేల్స్ ను ప్రకటించాయి. జనవరి 19 నుండి 22 వరకు జరిగే ఈ సేల్స్ లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్ లపై వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నాయి. బడ్జెక్ట్ ధరలో 10 వేల లోపు ధరలో కొన్ని ఫోన్ లను గొప్ప ఆఫర్లతో అందిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సేల్స్
 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ పేరుతో వస్తుండగా ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్స్ పేరుతో వస్తున్నది. అమెజాన్ లో SBI కార్డు కొనుగోలు మీద 10 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ ఐసీఐసీఐ మరియు కోటక్ మహింద్రా బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద గొప్ప డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ రెండు ఇ-కామర్స్ సంస్థలు కొత్తగా రిలీజ్ అయిన ఫోన్లతో పాటు కొన్ని రకాల ఫోన్లను డిస్కౌంట్ ధర వద్ద అందిస్తున్నాయి.

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

​రెడ్ మీ నోట్ 8

​రెడ్ మీ నోట్ 8

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి తాజాగా లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొబైళ్లలో ధరకు తగిన విలువను అందించే మొబైల్స్ లో ఈ ఫోన్ కూడా కచ్చితంగా ఉంటుంది. ఇందులో 6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు నాలుగు కెమెరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరాను, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది 28W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్... ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీగా తగ్గింపు ఆఫర్లు

రియల్‌మి 5i
 

రియల్‌మి 5i

ఈ ఫోన ప్రారంభ ధర రూ.8,990గా ఉంది. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఇప్పుడు వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. మెయిన్ కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Vivo S1 Pro: ఆకర్షణీయమైన ధర వద్ద నేడే మొదటి సేల్ ప్రారంభం...

రియల్‌మి 3 ప్రో

రియల్‌మి 3 ప్రో

ఈ ఫోన్ ధర ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 AIE ప్రాసెసర్ ను ఇందులో అందించారు. వెనకవైపు 16 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,045 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 20W VOOC 3.0 ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

Honor 9X స్మార్ట్‌ఫోన్ రిలీజ్... సేల్స్ ఆఫర్స్ అదుర్స్....

మోటోరోలా వన్ మాక్రో

మోటోరోలా వన్ మాక్రో

ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.2 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. హీలియో పీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

విండోస్ 7 వాడుతున్న వారికి కష్టాలు ఇక తప్పవు!!!

రెడ్ మి 8

రెడ్ మి 8

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. రెడ్ మీ 8లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆరా మిర్రర్ డిజైన్ ను ఇందులో అందించారు. 6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను ఈ ఫోన్ లో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇందులో డ్యూయల్ కెమెరా ఫీచర్ ఉంది. 12 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను వెనకవైపు అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ రెడ్ మీ 8లో ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Budget Smartphones Discount Offers on Amazon, Flipkart 2020 Sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X