బ్యాన్ ఎత్తివేత.. స్వేచ్చగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు!

Posted By: Prashanth

బ్యాన్ ఎత్తివేత.. స్వేచ్చగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు!

 

న్యూఢిల్లీ: బల్క్ ఎస్ఎంఎస్ ఇంకా ఎమ్ఎమ్ఎస్‌లను పంపడం పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం గురువారం ఎత్తివేసింది. అసోంలో హింసాత్మక సంఘటనలకు సంబంధించి చెలరేగిన వదంతులను అరికట్టేందుకు ఆగష్టు 17 నుంచి బల్క్ ఎస్ఎంఎస్ ఇంకా ఎమ్ఎమ్ఎస్‌ల పై కేంద్ర హోంశాఖ నియంత్రణ విధించిన విషయం తెలసిందే. నిషేధంలో భాగంగా తొలత రోజుకు అయిదు ఎస్ఎంఎస్‌లు మించి పంపుకునేందుకు ఆస్కారం ఉండేది కాదు. ఆగష్టు 23న ఆ నిషేధాన్ని కాస్తా సడలిస్తూ రోజుకు 20 ఎస్ఎంఎస్‌లవరకూ పంపుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని రోజుల నుంచి ఎస్ఎంఎస్‌ల ద్వారా ఎటువంటి వదంతులు వ్యాప్తిచెందకపోవటంతో నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది.

Read In English

ఆదాయంలో కోత:

ఎస్‌ఎంఎస్‌ల పై నియంత్రణలు విధించటం వల్ల మొబైల్ యూజర్లు తీవ్ర ఇబ్బందలను ఎదుర్కొవల్సి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ అత్యవసర చర్య కారణంగా టెలికాం ఆపరేటర్లకు ఈ నెలలో 7 నుంచి 8% మేరకు ఆదాయంలో కోతపడనుందని సెల్యులర్ ఆపరేటర్ల అసోసియేషన్ (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తమ అంచనాలను వెల్లడించారు.

Bulk SMS, MMS Ban Withdrawn by Indian Government

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot