‘బల్క్ ఎస్ఎంఎస్‌’లు బంద్!

Posted By: Prashanth

‘బల్క్ ఎస్ఎంఎస్‌’లు బంద్!

 

ఆస్సాం అల్లర్ల నేపధ్యంలో ఈ రోజు నుంచి దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు బల్క్ ఎస్ఎంఎస్ ఇంకా ఎమ్ఎమ్ఎస్‌లను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంఘవిద్రోహ శక్తులు కొన్ని వదంతులతో కూడిన సందేశాలతో ఆస్సామీలను భయబ్రాంతులకు గురిచేస్తున్న నేపధ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ తెలిపారు. టెలికాం ఆపరేటర్లు ఈ ఆదేశాలు పాటించేలా చూడాలని టెలికాం విభాగానికి హోంశాఖ సూచించింది. కేంద్ర హోంశాఖ తాజా ఆదేశాల ప్రకారం ఒక్కో విడతకు సందేశాలైతే ఐదు, సమాచార దృశ్యాలైతే 12 కేబీలకు మించి పంపించటానికి వీలుపడదు. దాడుల భయం, ఆభద్రత భావం నడుమ ఆస్సామీలు పెద్దఎత్తున దేశంలోని వివిధ నగరాల నుంచి స్వస్థలాలకు తరలుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot