ప్రీ పెయిడ్ యూజర్లకు BSNL బంపరాఫర్

Written By:

ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు అన్ని టెల్కోలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ టెల్కోలన్నీ యూజర్లను ఆఫర్ల సునామిలో ముంచెత్తుతున్నాయి. కష్టమర్లను కాపాడుకునేందుకు తక్కవ ధరకు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ తమ మొబైల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది.

దుమ్ము రేపుతున్న Bsnl 4జీ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ .786 తో రీచార్జ్ చేసుకుంటే

రూ .786 తో రీచార్జ్ చేసుకుంటే రూ. 900 టాక్టైంతో పాటు 300 ఎంబీ ఉచిత ఇంటర్నెట్ డాటా రానుంది. ఈ ఆఫర్ జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ .500 తో రీచార్జ్ చేసుకుంటే

మరో ఆఫర్లో ... రూ .500 తో రీచార్జ్ చేసుకుంటే రూ .600 టాక్టైం రానుంది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 15 తో ముగియనుంది.

మరింత సమాచారాన్ని

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ ఆఫర్స్ ప్రకటించినట్టు హైదరాబాద్ మార్కెటింగ్ డీజీఎం ఎం.శేషు అలివేలు తెలిపారు. మరింత సమాచారాన్ని 9490190866 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

జనవరి నుంచి ఉచిత అన్ లిమిటెడ్ ఆఫర్లను

ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ తన కష్టమర్ల కోసం జనవరి నుంచి ఉచిత అన్ లిమిటెడ్ ఆఫర్లను ప్రవేశపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. జియోకి పోటీగా ఈ ప్లాన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

రూ. 249కే అన్ లిమిటెడ్ డేటా

ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ ఇప్పటికే బ్రాడ్‌బాండ్ రంగంలో రూ. 249కే అన్ లిమిటెడ్ డేటా అంటూ సంచలనం రేపిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bumper bonanza for BSNL customers Get Extra Talk time on your Recharge read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot