వ్యాపార సంస్థలకు ఆధార్ షాక్, వాడితే ఇకపై రూ. 20 చెల్లించాల్సిందే

ఆధార్ ను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలకు ఆధార్ సంస్థ యుఐడిఎఐ షాక్ ఇచ్చింది. ఆధార్ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస

|

ఆధార్ ను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలకు ఆధార్ సంస్థ యుఐడిఎఐ షాక్ ఇచ్చింది. ఆధార్ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వినియోగదారుడి ధృవీకరణ కోసం రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సంస్థలు నిర్వహించే ప్రతి లావాదేవి దృవీకరణరు 50 పైసలు చెల్లించాలని యుఐడిఎఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది.

వ్యాపార సంస్థలకు ఆధార్ షాక్, వాడితే ఇకపై రూ. 20 చెల్లించాల్సిందే

ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ.20 (పన్నులతో సహా) చెల్లించాలని, ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) చెల్లించాలని యుఐడిఎఐ నోటిఫికేషన్‌లో తెలిపింది.

ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లకు

ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లకు

ఆధార్ రెగ్యులేషన్స్ 2019 ప్రకారం, ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లకు లావాదేవీ చార్జీలలో మినహాయింపు ఇచ్చారు. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్‌ సేవలు అందిస్తునన్న షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులకు ఆథెంటికేషన్‌ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ లక్ష్యాలను అవి చేరలేకపోతే.. టార్గెట్‌కి తగ్గట్లుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది.

ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లో

ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లో

మిగిలిన అన్ని ప్రభుత్వ - ప్రైవేటు సంస్థలు ఇక ఆధార్ ప్రామానిక సేవలు పొందుతున్నందుకు లావాదేవీల రుసుములు చెల్లించాల్సిందే. సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లో లోపు ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతో పాటు ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని యుఐడిఎఐ హెచ్చరించింది.

విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో
 

విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో

ఇప్పటికే ఆధార్‌ ఆధారిత ధృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు.. తాజా నోటిఫికేషన్‌ విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

భద్రతాపరమైన షరతులన్నింటినీ

భద్రతాపరమైన షరతులన్నింటినీ

ఆధార్‌ ఆర్డినెన్స్‌కు సవరణల కారణంగా ఆధార్‌ ఆథెంటికేషన్‌ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లవుతుందని వివరించాయి. అయితే, ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది.

సంస్థలపై భారం

సంస్థలపై భారం

ఇకెవైసి వినియోగానికి సంస్థలు ఎక్కువగా ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. యుఐడిఎఐ తాజా నిర్ణయంతో ఇ కెవైసి వినియోగించుకునే సంస్థలపై భారం పడనుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు తీసుకోలేదని, ఇప్పుడు విధించినది నామమాత్రమేనని ఆధార్ సంస్థ పేర్కొంది.

దాదాపు రూ. 150–200 దాకా ఖర్చు

దాదాపు రూ. 150–200 దాకా ఖర్చు

ఆధార్‌ లేకుండా కేవైసీ ధృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు రూ. 150-200 దాకా ఖర్చవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఆధార్‌ ఆధారిత కేవైసీ ధృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇంటింటికీ తిరిగి వ్యయప్రయాసలకు గురవుతున్నామని సంస్థలు మొరపెట్టుకున్నాయి.

సంస్థలు కోరుతున్న నేపథ్యంలో

సంస్థలు కోరుతున్న నేపథ్యంలో

అధికారికంగా ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ, కేవైసీ సేవలు పొందుతామని ఎంతోకాలంగా డిమాండు చేస్తున్నాయి. దీనివల్ల తమతోపాటు వినియోగదారులకూ సౌలభ్యమని వాదిస్తున్నాయి. దీంతో సౌలభ్యం దృష్ట్యా ఆధార్‌ ఆధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

Best Mobiles in India

English summary
business organisations need to pay up to rs 20 for using aadhaar services uidai

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X