సామ్‌సంగ్ ఫోన్ కొంటే.. సమంతను కలిసే ఛాన్స్!

Posted By: Staff

సామ్‌సంగ్ ఫోన్ కొంటే.. సమంతను కలిసే ఛాన్స్!

హైదరాబాద్: మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ బిగ్‌సి రాష్ట్ర ప్రజలకు సరికొత్త కొత్త ఆఫర్‌ను అందిస్తోంది. 'సామ్‌సంగ్ మొబైల్ కొనండి.. సమంతను కలవండి' పేరుతో తెచ్చిన ఈ ఆఫర్‌ను బిగ్ సి చైర్మన్ ఎం బాలు చౌదరి గురువారం ప్రారంభించారు. ఈ ఆఫర్ ద్వారా బిగ్ సిలో సామ్‌సంగ్ మొబైల్‌ఫోన్ కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్‌కు ఒక లక్కీ కూపన్ ఇస్తామని, ఆఫర్ ముగిసిన తర్వాత 100 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, సినీ తార సమంత చేతుల మీదుగా 100 సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లను బహుమతిగా అందిస్తామని ఆయన వివరించారు.

అంతేకాకుండా సామ్‌సంగ్ నోట్ మొబైల్ కొనుగోలుపై బంగారు నాణాన్ని, సామ్‌సంగ్ ఎస్2 కొనుగోలుపై వాక్యూమ్ క్లీనర్‌ను, నోకియా 610 కొనుగోలుపై 5 గ్రాముల వెండి నాణాన్ని, సెల్‌కాన్ ఎ88 కొనుగోలుపై బ్లూటూత్, 8 జిబి మెమరీ కార్డ్, సోనీ ఎక్స్‌పీరియా కొనుగోలుపై హెడ్ సెట్‌ను, మైక్రోమాక్స్ ఎ75 కొనుగోలుపై 8జిబి మెమరీ కార్డ్, బ్లూటూత్‌ను ఉచితంగా అందజేస్తామని ఆయన చెప్పారు. ఇవేకాకుండా ఎంపిక చేసిన కొన్ని మొబైళ్ల కొనుగోళ్లపై కూడా బహుమతులను అందజేస్తామని తెలిపారు. అక్టోబర్ 10 వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting