Home
News

ఒప్పో రెనో ఫోన్ పై రూ.9100ల ఆఫర్ ఉచితం !

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Oppo నుండి వస్తున్న రెండు తాజా స్మార్ట్ ఫోన్లు ఒప్పో రెనో మరియు ఒప్పో రెనో 10X జూమ్. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు నేటి నుంచి అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్,ఫ్లిప్ కార్ట్,paytm మాల్,స్నాప్ డీల్ మరియు ఒప్పో ఆన్లైన్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతున్నాయి.ఈ రెండు ఫోన్లు రెండు వేరియంట్ లలో లభిస్తాయి.

buying an oppo reno or reno 10x zoom jio oppo reno offer bundles benefits worth rs 9100

ఒప్పో రెనో స్మార్ట్ ఫోన్ 8 GB/128 GB వేరియంట్ ధర Rs 32,990. రెనో 10 x జూమ్ రెండు వేరియంట్ ధరలు వరుసగా 6GB + 128GB వేరియంట్ Rs 39,990 మరియు 8GB + 256GB వేరియంట్ Rs 49,990. ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు రిలయన్స్ జియో కంపెనీ రూ .9,100 లాభాలతో జియో ఒప్పో రెనో ఆఫర్ను ప్రకటించింది.

జియో ఒప్పో రెనో ఆఫర్:

జియో ఒప్పో రెనో ఆఫర్:

Oppo రెనో లేదా Oppo రెనో 10x జూమ్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడు Jio Oppo Reno ఆఫర్ను పొందటానికి అవకాశం ఉంటుంది.ఇందులో బాగంగా ప్రీపెయిడ్ ప్లాన్ కోసం సైన్ అప్ చేయడానికి 299 రూపాయలతో మొట్టమొదటి రీఛార్జ్ ను పొందుతారు.ఇది రోజుకు 3GB డేటా తో పాటు స్థానిక, STD మరియు రోమింగ్ వాయిస్ కాల్స్ ను ఉచితంగా 28రోజుల పాటు పొందవచ్చు.దీని తరువాత వినియోగదారుడు వారి ఖాతాలో 39 వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్ పొందుతాడు. ప్రతి కూపన్ యొక్క వోచర్ ధర 150 రూపాయలు.150 రూపాయల ప్రతి కూపన్ ను వినియోగదారుడు తన తదుపరి రీఛార్జ్ కోసం వాడవచ్చు.అంటే ఒక కూపన్ ఒక రీఛార్జికి వాడవచ్చు.దీని వలన మీకు క్యాష్ బ్యాక్ రూపంలో రూ .5,850 మొత్తం లాభం అందిస్తుంది.రూ.150 యొక్క ప్రతి కూపన్లు గరిష్టంగా 2022 ఆగస్టు 31 వరకు సబ్ స్క్రయిబర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.దాని తరువాత ఏదైనా ఉపయోగించని కూపన్లు ఉంటే అవి ఉపయోగించడానికి అనర్హమైనవి అని రిలయన్స్ జియో ప్రకటించింది.

క్లియర్ ట్రిప్ క్యాష్ బ్యాక్ కూపన్ ప్రయోజనం:

క్లియర్ ట్రిప్ క్యాష్ బ్యాక్ కూపన్ ప్రయోజనం:

మిగిలిన రూ.3,250 విలువైన మొత్తం క్లియర్ ట్రిప్ క్యాష్ బ్యాక్ కూపన్ ప్రయోజనం రూపంలో ఒప్పో రెనో లేదా రెనో 10x జూమ్ కొనుగోలు చేసిన రిలయన్స్ జీయో వినియోగదారులు పొందుతారు. ఈ విలువైన మొత్తం క్లియర్ ట్రిప్ యాప్ లో ప్రతి బుకింగ్ మీద క్యాష్ బ్యాక్ రూపంలో పొందుతారు. 5000 లేదా పైన రౌండ్ ట్రిప్ దేశీయ విమాన ప్రయాణం టికెట్ కొనుగోలు మీద మీరు కనీసం 500 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందుతారు.దేశీయ హోటల్ బుకింగ్ కోసం 5000 లేదా పైన బుకింగ్ మొత్తం చేసినప్పుడు రూ.750ల క్యాష్ బ్యాక్ పొందవచ్చు.రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ విమాన ప్రయాణ టిక్కెట్ ను కొనుగోలు చేసినప్పుడు బుకింగ్ మొత్తాల మీద వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.మరియు రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ హోటల్ బుకింగ్ పైన రూ.1000ల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ మొత్తం మీ Cleartrip ఖాతాకు చేర్చబడతాయి.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

6.6-inch ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ AMOLEDడిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10ఎక్స్ హైబ్రిడ్ ఆప్టిక‌ల్ జూమ్‌, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,USB టైప్C , డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4065mAh బ్యాట‌రీ,VOOC 3.0 ఫాస్ట్ చార్జింగ్‌.

 డిస్ ప్లే

డిస్ ప్లే

OPPO Reno 10x Zoom 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే వచ్చింది. మల్టీమీడియా అభిమానులకు అదిరిపోయే అనుభూతిని అందిస్తుంది. 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ తో ఆపరేటింగ్ చాలా వేగవంతంగా ఉంటుంది. ఎటువంటి అంతరాయం లేకుండా గేమింగ్ ను ఆడుకోవచ్చు. 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌తో పాటు 4065mAh భారీ కెపాసిటీ బ్యాట‌రీ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

కెమెరా:

కెమెరా:

ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేయ‌గా, 13 మెగాపిక్స‌ల్ ఉన్న మ‌రో టెలిఫొటో కెమెరాను కూడా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు.అలాగే 8ఎంపీ కెమెరాను కూడా ఇందులో పొందుపరిచారు. దీనికి 10ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. వివిధ రకాల మోడ్ లతో వచ్చిన ఈ కెమెరా ద్వారా ఫోటోలను ఆకర్షణీయంగా తీసుకోవచ్చు. Ultra Night Mode 2.0 ఫీచర్ ఈ ఫోన్ కి అదనపు బలాన్ని ఇవ్వనుంది. 4K video recordingని ఈ ఫోన్లో రికార్డ్ చేయవచ్చు. 360 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని ఆడియో వీడియో నాణ్యంగా అందిస్తుంది. ఓవరాల్ గా ఆడియో వీడియో క్వాలిటి అదిరిపోయే విధంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సైడ్ లిఫ్టింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
buying an oppo reno or reno 10x zoom jio oppo reno offer bundles benefits worth rs 9100
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X