బడ్జెట్ 5G ఫోన్‌లను కొనడం అంత మంచిది కాదు!! ఎందుకో తెలుసా??
ప్రస్తుత ప్రపంచం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ స్మార్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎక్కువ మంది తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సరసమైన స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ఎక్కువగా ఉండే ఒక విషయం ఏమిటంటే ఇవి 18 లేదా 24 నెలలకు మించి బాగా పనిచేయవు. అంతేకాకుండా ఈ ఫోన్‌లకు అందించే ఆండ్రాయిడ్ మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి.

ఇంకొక అతిపెద్ద సమస్య విషయానికి వస్తే వీటితో ప్రాథమిక పనులు మినహా ప్రీమియం ఫోన్‌లు చేసే మెరుగైన పనులు ఏవి కూడా చేయలేదు. అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వారి యొక్క అమ్మకాలను పెంచడానికి సరసమైన ధరల వద్ద లభించే 5G స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకు వస్తున్నాయి. 5G చిప్‌సెట్‌ల ధర 4G చిప్‌సెట్‌ల కంటే చాలా ఎక్కువ అని గమనించండి. కాబట్టి రెండు ఫోన్‌లలో 5G మరియు 4G ఫోన్ ఒకే ధర వద్ద లభిస్తే కనుక 5G ఫోన్ అందించే స్పెసిఫికేషన్‌లు తక్కువగా ఉంటాయి. వీటి గురించి మరింత సరళంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తక్కువ స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ 5G ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఖర్చులను ఆదా చేయడానికి మరియు ఫోన్ ధరను తగ్గించడానికి తయారీదారులు డిస్‌ప్లే నాణ్యతను తగ్గిస్తున్నారు. దీనితో పాటుగా స్మార్ట్‌ఫోన్ మొత్తం ధరను 5G చిప్‌సెట్‌తో కూడా తగ్గించవచ్చు. అదే సమయంలో 4G చిప్‌సెట్ చౌకగా ఉన్నందున తయారీదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో మెరుగైన డిస్‌ప్లే మరియు మెరుగైన నాణ్యతా భాగాలను బండిల్ చేయవచ్చు. అంటే 4G ఫోన్ ను చాలా తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లతో అందిస్తారు. ప్రస్తుతం ఇండియాలో రెండు ప్రాథమిక కారణాల వల్ల సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం అంత మంచి ఎంపిక కాదు.

A) మొదటి కారణం భారతదేశంలో ఇప్పటికీ ప్రత్యక్ష 5G నెట్‌వర్క్‌లు అందుబాటులో లేవు. అందువల్ల చాలా OEM లకు 5G టెల్కోస్ మద్దతు ఇచ్చే బ్యాండ్‌లు ఏవీ తెలియదు. OEM లు తమ ఉత్పత్తులను తయారు చేసే ముందు ఆపరేటర్లతో మాట్లాడుతున్నట్లు గతంలో చెప్పాయని గమనించండి. అయితే నేటి 5G ఫోన్‌లు భవిష్యత్తులో అన్ని 5G బ్యాండ్‌లకు మద్దతు ఇవ్వకపోవడం పూర్తిగా సాధ్యమే.

B) 5G ఫోన్ల ధర ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. ఉత్పత్తి పెరుగుతున్న స్థాయి మరియు సరఫరా గొలుసు తగ్గింపుతో ఫోన్‌ల ధర కూడా తగ్గుతుంది. కావున మీరు ఆరోజు ప్రస్తుత 4G పరికరాల ధరకే మెరుగైన 5G స్మార్ట్‌ఫోన్‌లను చూడవచ్చు.

మీరు ఈరోజు 5G ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే కనుక మిడ్-రేంజ్ లేదా ఫ్లాగ్‌షిప్ డివైజ్‌తో వెళ్లడం మంచిది. ఎందుకంటే కనీసం మీరు మీ డబ్బు విలువను అందుకోవచ్చు, మరియు మీరు దానిని ఎక్కువ కాలం ఉపయోగించగలరు . ఇండియాలో కనీసం 2022 రెండవ త్రైమాసికం నాటి వరకు కూడా మొదటి ప్రత్యక్ష 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రాదు. 5Gని మొదట విడుదల చేయడం రేసులో ఏ ఆపరేటర్ విజయం సాధిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Airtel 5G నెట్‌వర్క్
భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు 5G నెట్‌వర్క్ ను ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో తన 5G నెట్‌వర్క్ టెస్ట్ ట్రయల్స్‌ను నిర్వహించింది. ఫీనిక్స్ మాల్‌లోని నోకియా యొక్క 5G గేర్‌ను ఉపయోగించి 5G నెట్‌వర్క్ ట్రయల్ జరిగింది. ఈ పరీక్ష సమయంలో ఎయిర్టెల్ యొక్క ట్రయల్ నెట్‌వర్క్ యొక్క స్పీడ్ టెస్ట్‌ను ప్రదర్శించడానికి ఒక వీడియోను కూడా టెల్కో సంస్థ చిత్రీకరించింది. ఇది కంపెనీ అల్ట్రా-లెస్ జాప్యం మరియు 850 Mbps వేగంతో అప్‌లోడ్ స్పీడ్ మరియు 1.2Gbps డౌన్‌లోడ్ స్పీడ్ ను సాధించగలిగింది. ముంబై ట్రయల్ సమయంలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గుర్గావ్ యొక్క సైబర్ హబ్ ప్రాంతంలో చివరి 5G నెట్‌వర్క్ ట్రయల్ సమయంలో సెట్ చేసిన 1Gbps యొక్క మునుపటి స్పీడ్ టెస్ట్ రికార్డును అధిగమించగలిగింది. గుర్తుచేసుకుంటే జనవరిలో ఎయిర్‌టెల్ సంస్థ NSA (నాన్-స్టాండ్ అలోన్) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 MHz బ్యాండ్‌పై హైదరాబాద్‌లోని వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా ప్రత్యేక్షంగా 5G సేవలను విజయవంతంగా ప్రదర్శించిన మొదటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications